X
మత్తు వదలరా
Drama | 25 Dec 2019 | U/A |
Telugu

మత్తు వదలరా స్టోరీ

మత్తు వదలరా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సింహా కొడూరి, నరేష్ అగస్థ్య, అత్యుల్య చంద్ర, సత్య అక్కల, బ్రహ్మజి ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రితేష్ రానా వహించారు మరియు నిర్మతలు చిరంజీవి (చెర్రీ), హేమలత కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల బైరవ అందించారు.

కథ 

బాబూ మోహన్ (శ్రీ సింహా కోడూరి) డెలీవరి బాయ్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య), అభి (అగస్త్య)తో ఇరుకు గదిలో చాలీచాలని జీతంతో ఓ రకమైన ఫ్రస్టేషన్‌తో ఉండే యువకుడు బాబూ మోహన్. తన రూమ్‌మేట్ ఏసుదాస్ (కమెడియన్ సత్య) సలహాతో కస్టమర్‌ (పవలా శ్యామల)ను చీట్ చేయబోయి.. ఓ మర్డర్ ఘటనలో భాగమవుతాడు. అంతేకాకుండా రూ.50 లక్షలు కూడా చేతికి వస్తాయి. బాబూ మోహన్ హత్యా ఘటనలో ఎలా భాగమయ్యాడు? కస్టమర్‌ను డెలీవరి బాయ్‌గా బాబూ మోహన్ ఎలా చీట్ చేయబోయాడు? కస్టమర్‌‌ను బాబూ మోహన్ నిజంగా చంపేశాడా? ఈ కథలో ‘షెర్లాక్' అభి పాత్ర ఏంటి? ఇలాంటి మర్డర్ మిస్టరీలో సత్య కామెడీ ఎలా సింక్ అయింది? ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ పాత్రలు ఎలా కీలకంగా మారాయి? చివరకు హత్యా ఘటన నుంచి బాబూ మోహన్ బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ఎలా సఫలమయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే మత్తు వదలరా చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+