twitter

    మిరపకాయ్ స్టోరి

    మిరపకాయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్‌, ప్రకాష్ ‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, సునీల్‌, చంద్రమోహన్‌, అలీ, సురేఖావాణి, అజయ్‌, సుధ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం హరీష్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అయిన రిషి(రవితేజ) ఉరఫ్ మిరపకాయ ఓ మిషన్ నిమిత్తం డిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఆ మిషన్ లో భాగంగా ఓ కాలేజీలో హిందీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. ఖాళీగా ఉండటమెందుకన్నట్లు అక్కడి స్టూడెంట్ వినమ్ర(రిచా గంగోపద్యాయ్)తో ప్రేమలో పడి పాటలు పాడుతుంటాడు. ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందనగా అతనికి అప్పచెప్పిన మిషన్ పూర్తి వివరాలు తెలుస్తాయి. వాటి ప్రకారం ఆ కాలేజీ కొత్త స్టూడెంట్ వైశాలి(దీక్షా సేధ్) ని రిషి...ప్రేమలో పడేయాలని ఆ మిషన్ లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు రిషి తన ప్రేయసి ఎదురుగా వైశాలిని ఎలా ప్రేమలో దించాడు...ఇంతకీ వైశాలిని ప్రేమలో పడేయటానికి ఇంటిలిజెన్స్ కు ఉన్న కారణం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie మిరపకాయ్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X