మిషన్ ఇంపాజిబుల్ (2022)(U/A)
మిషన్ ఇంపాజిబుల్ స్టోరి
మిషన్ ఇంపాజిబుల్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తాప్సీ పన్ను తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం: స్వరూప్ ఆర్ ఎస్ జె, నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఎన్ ఎం పాష, సినిమాటోగ్రఫి: దీపక్ యరగర, సంగీతం: మార్క్
కథ
చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఉన్న వడమాలపేటకు చెందిన రఘుపతి(హర్ష రోషన్), రాఘవ(భాను ప్రకాష్), రాజారామ్(జయతీర్థ) లకు చదువు మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. రఘుపతి ఎప్పటికైనా రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు అవ్వాలని కలలు కంటూ ఉంటే రాఘవ మాత్రం ఎప్పటికైనా కౌన్ బనేగా కరోడ్పతి లో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాజా రామ్ కి ఎప్పటికైనా ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కల. చదువు మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టని వీళ్ళు డబ్బు సంపాదించాలంటే దావూద్ ఇబ్రహీంను పోలీసులకు పట్టిస్తే సులభంగా సంపాదించవచ్చు అని భావిస్తారు. అలా బొంబాయి వెళ్దామని బయలు దేరిన వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో బెంగళూరు వెళతారు. వీళ్లకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ(తాప్సీ) కనపడుతుంది. వీరిలో రాజారామ్ కిడ్నాప్ కాగా వీరి ద్వారా శైలజ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఆట ఎలా కట్టించింది అనేదే ఈ సినిమా కథ.