మిత్రుడు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, ప్రియమణి, చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, బాలయ్య, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, హేమ, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహాదేవ్ నిర్వహించారు మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ స్వరాలు సామకుర్చరు.
కథ
ఇందు(ప్రియమణి) ఓ పెద్దింటి అమ్మాయి. మలేషియాలో ఉన్నామెకు జాతకం చూపించుకుంటుంది(ఇంట్లో పెద్దలు చూపించరు..ఆమే చూపించుకుంటుంది). దాంట్లో ఆమెకు పెళ్ళయితే ...భర్త నెల లోపలే చస్తాడు అని ఉంటుంది. అయితే అప్పటికే ఆమె దీపక్ తో ప్రేమలో ఉంటుంది. దాంతో ఓ బకరాని పట్టుకుని వాడిని పెళ్ళి చేసుకుని తన నష్ట జాతకానికి బలిపెడదామని ప్లాన్ చేస్తుంది. అలా ఆమె బకరా కోసం వెతుకుతున్న సమయంలో ఎదురౌతాడు ఆదిత్య (బాలకృష్ణ). అతను ఎప్పుడూ ఎప్పుడూ తాగుతూ,ఒంటరిగా ఏదో పోగుట్టుకున్నట్లు నిరాశ, నిస్పృహలతో ఉంటాడు. అతన్ని సెలెక్టు చేసుకున్న ఆమె రకరకాల సినిమాటెక్ విన్యాసాలతో ప్రేమలో పడేసి ఒప్పించి పెళ్ళిచేసుకుంటుంది. అప్పుడు ఏం జరిగింది..ఆదిత్య నిజంగానే మరణిస్తాడా..ఆమె ప్రేమించిన దీపక్ ఏమయ్యాడు..ఇంతకీ ఆదిత్య నీరసంగా అలా నిర్వేదంతో ఉండటానికి కారణం ఏమిటి అన్న విషయాలుపై ఆసక్తి కలిగిన వాళ్ళు తెరపై చూడాల్సిందే.