X
తెలుగు » సినిమాలు » మిత్రుడు
మిత్రుడు

మిత్రుడు

Family | 01 May 2009 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

మిత్రుడు స్టోరీ

మిత్రుడు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, ప్రియమణి , చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌, బాలయ్య, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, హేమ, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహాదేవ్ నిర్వహించారు మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ స్వరాలు సామకుర్చరు. కథ ఇందు(ప్రియమణి) ఓ పెద్దింటి అమ్మాయి. మలేషియాలో ఉన్నామెకు జాతకం  చూపించుకుంటుంది(ఇంట్లో పెద్దలు చూపించరు..ఆమే చూపించుకుంటుంది). దాంట్లో ఆమెకు పెళ్ళయితే ...భర్త నెల లోపలే చస్తాడు అని ఉంటుంది. అయితే అప్పటికే ఆమె దీపక్ తో ప్రేమలో ఉంటుంది. దాంతో ఓ బకరాని పట్టుకుని వాడిని పెళ్ళి చేసుకుని తన నష్ట జాతకానికి బలిపెడదామని ప్లాన్ చేస్తుంది. అలా ఆమె బకరా కోసం వెతుకుతున్న సమయంలో ఎదురౌతాడు ఆదిత్య (బాలకృష్ణ). అతను ఎప్పుడూ ఎప్పుడూ తాగుతూ,ఒంటరిగా ఏదో పోగుట్టుకున్నట్లు నిరాశ, నిస్పృహలతో ఉంటాడు. అతన్ని సెలెక్టు చేసుకున్న ఆమె రకరకాల సినిమాటెక్ విన్యాసాలతో ప్రేమలో పడేసి ఒప్పించి పెళ్ళిచేసుకుంటుంది. అప్పుడు ఏం జరిగింది..ఆదిత్య నిజంగానే మరణిస్తాడా..ఆమె ప్రేమించిన దీపక్ ఏమయ్యాడు..ఇంతకీ ఆదిత్య నీరసంగా అలా నిర్వేదంతో ఉండటానికి కారణం ఏమిటి అన్న విషయాలుపై ఆసక్తి కలిగిన వాళ్ళు తెరపై చూడాల్సిందే.
Read More

మిత్రుడు కాస్ట్ & క్రూ

మిత్రుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం మహాదేవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిత్రుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్త డైరక్టర్..రాజమౌళి శిష్యుడు..అందులోనూ బాలకృష్ణను హీరోగా తీసుకున్నాడు..ఏదో యాక్షన్ ఫిలిం చేసి అదర కొడతాడు..అని ఎన్నో ఆశలు పెట్టుకుని మిత్రుడు ధియోటర్లో దూకిన వాళ్ళకు తీవ్ర నిరాశే ఎదురైంది. దర్శకుడుగా ప్రమోట్ అయిన మహదేవ్ తనపై అందరూ పెట్టుకున్న అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎనభైల నాటి ఓ ఫ్యామిలీ కథను దుమ్ము దులిపి తీసాడు. అంతేగాక ఆ కాలానికి తగ్గ టేకింగ్ తోనే ఆ కథను తెరకెక్కించాడు. దాంతో టీవీ సీరియల్ చూస్తున్న అనుభూతి కలిగి ప్రేక్షకులకు విసుగు రప్పించింది. అక్కడికీ బాలకృష్ణ ఉన్నంతలో సీన్లు పండించటానికి ట్రై చేసారు. కానీ రస హీనమైన కథలో ఆ సన్నివేశాలు పేలవంగా మారి ఎంత లాగినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మిత్రుడు ఏ సెంటర్ నైనా మెప్పించగలగుతాడా అన్నది సందేహంగా మారిపోయింది.

మిత్రుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మిత్రుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+