మొగుడు సినిమా రోమ్యాంటిక్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్, రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్, గీతాంజలి, మహర్షి రాఘవ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బాబూ శంకర్ స్వరాలు సమకుర్చారు.
కథ
బుజ్జి(గోపీచంద్)తొలిచూపులోనే రాజి(తాప్సి)తో ప్రేమలో పడిపోతాడు.దానికి అతని తండ్రి ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్)వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాజి తల్లి,రాష్ట్ర మంత్రి అయిన అఖిలాండేశ్వరి(రోజా)తో మాట్లాడి పెళ్లి ఘనంగా జరిపిస్తాడు.అయితే పెళ్లంతా అయిన తర్వాత గౌరి దేవి విగ్రహాన్ని పెళ్లి కూతురుతో పాటు తీసుకెళ్లాలనే సంప్రదాయం వద్ద ఇరు కుటుంబాలకి గొడవ వస్తుంది.చిన్నగా మొదలైన ఆ గొడవ పెద్దదై రాజీ తన మెళ్లో తాళిని విసిరి బుజ్జి పైకి విసిరికొట్టేవరకూ వెళ్తుంది.అలా పీటల మీదే పెళ్లి పెటాకులయ్యి విడాకుల వరకూ వెళ్తుంది.అప్పుడు ఆ జంట పరిస్ధితి ఏమిటి..చివరకు వారు ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.