మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)(U/A)
Release date
15 Oct 2021
genre
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టోరి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ మూవీ కోసం అఖిల్ జుట్టు, గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాపాత్డురల్లో నటిస్తున్నారు. పూజ హెగ్డే తదితరలు ముఖ్య . బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం : గోపి సుందర్, కెమెరా : మణికందన్.
కథ
బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అయ్యి ఉద్యోగం చేస్తున్న హర్షకు(అఖిల్) మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక.. తమ ఉమ్మడి కుటుంబంలో చూస్తూ పెరిగిన దాని ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి సర్దుకుపోయే వ్యక్తి అయితే జీవితం అంతా సంతోషంగా గడిచి పోతుంది అనే ఆలోచనతో ఉంటాడు. అదే ఆలోచనతో 20 రోజులు సెలవు దొరకడంతో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని 20 మంది అమ్మాయిలను చూసి ఒకరిని ఫైనల్ చేసి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తాడు. అలా వచ్చిన హర్ష జాతకాలు కలవలేదని హర్ష తల్లిదండ్రులు రిజెక్ట్ చేసిన విభా(పూజా హెగ్డే) మాటలతో ముందు కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత ఆమె మాటలు అర్థమయ్యాక ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే పరిస్థితులు తారుమారయ్యాయి, ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. పోలీసు కేసులు కూడా అయ్యాక హర్ష తల్లిదండ్రులు హర్షను అమెరికా పంపించేస్తారు. చివరికి హర్ష, విభాలు ఎలా కలిశారు అనేది సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ with us? Please send it to us ([email protected]).