మిస్టర్ మన్మథ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, సోనియా దీప్తి, కొండవలస, శివన్నారాయణ, అల్లరి సుభాషిణి, మెల్కొటే, వేణు, జీవా, అమిత్, దీపికాదాస్, రాజా శ్రీధర్, నండూరి రాము తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: సత్యం బెల్లంకొండ నిర్వహించారు మరియు నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, గుండ్లకుంట శ్రీరాములు కలసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు నవనీత్ చారి స్వరాలు సమకుర్చారు.
కథ
హీరో తనకు గర్ల్ ఫ్రెండ్ తెలుగు కల్చర్ పట్ల ప్రేమ, అభిమానం కలిగి ఉండాలని కోరుకుంటాడు. తనకు కాబోయే డారికి సిక్స్ ప్యాక్ లేక పోయినా మంచి సాలరీ, కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ధనవంతుడై ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి మనస్తత్వం గల ఇద్దరు వ్యక్తులు తమకు తగిన వారిని ఎలా దక్కించుకున్నారు అనేదాన్ని ఎంటర్ టైన్మెంట్ జోడించి చెప్పారు.