మిస్టర్ నూకయ్యా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్, సనాఖాన్, కృతికర్బందా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మురళీకృష్ణ, భావన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అని కన్నెగంటి నిర్వహించారు మరియు నిర్మాత డి ఎస్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువనశంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.
కథ
సెల్ ఫోన్ దొంగ నూకయ్య(మంచు మనోజ్) డబ్బు పిచ్చి ఉన్న శిల్ప (సనాఖాన్)తో ప్రేమలో ఉంటాడు. పబ్ లో పనిచేసే ఆమె తనని పెళ్లిచేసుకుని సెటిల్ అవ్వాలంటే మంచి ఇల్లు, కారు వంటివి సంపాదించాలని నూకయ్య కి కండీషన్ పెడుతుంది. మరో ప్రక్క బ్యాంక్ మేనేజర్ అను (కృతికర్బందా) భర్త (రాజా) కిడ్పాప్ కి గురి అవుతాడు. కిడ్నాపర్ రెండు కోట్లు ఇచ్చి విడిపించుకెళ్లమని ఆమెకు కండీషన్ పెడతాడు. దాంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె తను చేసే బ్యాంక్ లో ఆ రెండు కోట్లు నొక్కేసి తన భర్తని విడిపించుకు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తుంది. కరెక్టుగా అదే సమయంలో ఆ రెండు కోట్లు విషయం తెలుసుకున్న నూకయ్య వాటిని ఆమె దగ్గర నుంచి కొట్టేస్తాడు. అప్పుడు ఏమి జరిగింది. అను తన భర్తను విడిపించుకుందా. నూకయ్య తన గర్ల్ ప్రెండ్ ని పెళ్ళిచేసుకున్నాడా.. వంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.