నారప్ప సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
కథ
అనంతరపురం జిల్లాలోని మారుమూల గ్రామంలోని భూస్వామి పండుస్వామి (నరేన్)కు నారప్ప కుటుంబానికి భూ తగదా చోటుచేసుకొంటుంది. ఆ తగాదాలో భాగంగా నారప్ప పెద్ద కుమారుడు మునికణ్ణని పండుస్వామి మనుషులు హత్య చేస్తారు. తన అన్న హత్యకు ప్రతీకారంగా పండుస్వామిని సిన్నప్ప హత్య చేస్తాడు. దాంతో తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప కుటుంబం గ్రామాన్ని వదలి వెళ్తుంది. భూస్వామి, నారప్ప కుటంబాల మధ్య గొడవలకు అసలు కారణం ఏమిటి? భూస్వామి ఆగడాలను పెదవి పంటి కింద నొక్కి పెట్టి ఎందుకు సహనాన్ని నారప్ప ప్రదర్శించాడు. తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? చివరకు పండుస్వామి కుటుంబానికి, నారప్ప కుటుంబానికి మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే నారప్ప సినిమా కథ.
మూవీ రిలీజ్
జూలై 20, 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది