నాగభరణం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్ వివేక్, సాయి కుమార్, దర్శన్, సాధు కోకిల, ముకుల్‌దేవ్,రవి కాలే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోడి రామ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు సోహాలి అన్సారి, దావల్ గడ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చరు.
కథ
గ్రహణం సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోతూంటారు. అప్పుడు దుష్టశక్తులదే రాజ్యం. దాంతో ఆ శక్తులు రెచ్చిపోయి లోక వినాశనం మొదలెడతాయి. అలాంటి దుష్ట శక్తుల నుంచి లోకాన్ని కాపాడాలి. తమ శక్తిని కోల్పోయిన సమయంలో దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తమ శక్తినంతా దారపోసి ఓ మహాకలశాన్ని దేవతలు సృష్టిస్తారు. మరి కష్టపడి శక్తులన్ని దారపోసి సృష్టించిన ఆ మహాకలశాన్ని ఎక్కడ దాచాలి...అంటే భూమి మీద ఓ పవిత్ర స్థలంలో ప్రతిష్టించి, శివయ్య వంశస్థులను రక్షణగా నియమిస్తారు. దానికి అష్టదిగ్భంధనం చేస్తారు. ఆ కలశంను నాగభరణం అంటారు. కలశంను తమ వశం చేసుకుంటే తమకిక తిరుగుండదని లోకంలోని దుష్టశక్తులన్నీ ప్రయత్నాలు మొదలెడతాయి. ఆ కలసం తమ వసం అయితే దేవతల మీద ఆదిపత్యం ఈజీ అని వాటి భావన. దాంతో ఎన్నో దుష్టశక్తులు ఆ కలశాన్ని సొంతం చేసుకోవటానికి యుగయుగాలుగా ట్రైల్స్ వేస్తూంటాయి. అలా ప్రయత్నిస్తున్నవారిలో ఓ ప్రధానమైన దుష్ట శక్తి కపాలి (రాజేష్ వివేక్). ఈ శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) వంశం ఏళ్ళుగా కాపాడుతూ ఉంటుంది. అయితే శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచం నాగాభరణం ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, శక్తి కవచాన్ని కూడా జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి నాగాభరణం కోసం పోరాడుతుంది. అలా తరతరాలుగా పోరాటాలు జరిగేలా చేస్తున్న ఆ నాగభరణం అర్కియాలజీ డిపార్డ్‌మెంట్‌కు దక్కుతుంది. వారు దాన్ని ఢిల్లీ భద్రపరుస్తారు. చివరకు ఇండియాలో జరగబోయే వరల్డ్ మ్యూజిక్ కాంపిటీషన్‌లో గెలిచిన వారికి నాగభరణం బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తారు. దాని కోసం అనేక మంది పోటీలు పడుతుంటారు.
నాగచరణ్ (దిగంత్) ఓ మంచి సింగర్. సంగీతమే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఏ పోటీకి వెళ్లినా అతనిదే విజయం. అది తెలుసుకొని మానస (రమ్య) అతడిని ఇష్టపడుతుంది. ఒక పోటీని ఏర్పాటు చేసి.. అందులో గెలిచే విజేతకి ఆర్కియాలజీ సంస్థకి చెందిన పురాతన కలశం బహుమతిగా అందజేయాలనుకొంటుంది ప్రభుత్వం. చరణ్ కూడా ఆ పోటీలో పాల్గొంటాడు. ఆ కలశం ఎంతో మహిమ కలదని తెలుసుకొన్న వ్యాపారవేత్త ఒబెరాయ్ (ముకుల్‌దేవ్) నాగచరణ్‌ని సంప్రదిస్తాడు. ఎలాగైనా ఆ కలశాన్ని గెలిచి తనకి ఇవ్వాలని కోరతాడు. నాగచరణ్ అందుకు ససేమిరా అంటాడు. దాంతో కక్ష పెంచుకొన్న పారిస్ నుండి ఓ విలన్ గ్యాంగ్(ముకుల్ దేవ్, రవి కాలే తదితరులు) నాగచరణ్‌ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. నాగ్ చరణ్ దగ్గర శిష్యరికం చేయాలని నాగమ్మ(రమ్య) కోరుకుని, చరణ్ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌ను మచ్చిక చేసుకుని వారి గ్యాంగ్‌లో చేరుతుంది. ఎంతో శక్తివంతమైన నాగభరణంను గెలుచుకోవాలని పారిస్ నుండి ఓ విలన్ గ్యాంగ్(ముకుల్ దేవ్, రవి కాలే తదితరులు) ప్రయత్నం చేస్తూంటే దాన్ని మానస తిప్పి కొడుతుంది.
నాగాభరణం కోసం చరణ్ టీంను తమ కంపెనీ తరపున పోటీలో పాల్గొనాలని విలన్స్ అడుగుతారు. కానీ అందుకు చరణ్ ఒప్పుకోక పోవడంతో చరణ్ ఫ్రెండ్స్‌ను చంపేస్తారు. అప్పుడు నాగమ్మ పాముగా మారి విలన్స్‌ను చంపేస్తుంది. నాగమ్మ మనిషి కాదు, పాము అనే నిజం తెలుసుకున్న చరణ్ ఏం చేస్తాడు? అసలు నాగమ్మ ఎవరు? చరణ్ వద్దనే ఎందుకు శిష్యురాలుగా చేరుతుంది? అసలు ఇంతకీ నాగభరణంను చరణ్ గెలుచుకున్నాడా? మానస తన శక్తి సామర్థ్యాల్ని కోల్పోయాక ఆమె కోసం వచ్చిన మరో శక్తి ఎవరు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.