X
తెలుగు » సినిమాలు » నాగభరణం
నాగభరణం

నాగభరణం

Action | Thriller | 14 Oct 2016 | U/A | 120 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నాగభరణం స్టోరీ

నాగభరణం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్‌ వివేక్, సాయి కుమార్, దర్శన్, సాధు కోకిల, ముకుల్‌దేవ్‌,రవి కాలే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోడి రామ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు సోహాలి అన్సారి, దావల్ గడ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చరు. కథ గ్రహణం సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోతూంటారు. అప్పుడు దుష్టశక్తులదే రాజ్యం. దాంతో ఆ శక్తులు రెచ్చిపోయి లోక వినాశనం మొదలెడతాయి. అలాంటి దుష్ట శక్తుల నుంచి లోకాన్ని కాపాడాలి. తమ శక్తిని కోల్పోయిన సమయంలో దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తమ శక్తినంతా దారపోసి ఓ మహాకలశాన్ని దేవతలు సృష్టిస్తారు. మరి కష్టపడి శక్తులన్ని దారపోసి సృష్టించిన ఆ మహాకలశాన్ని ఎక్కడ దాచాలి...అంటే భూమి మీద ఓ పవిత్ర స్థలంలో ప్రతిష్టించి, శివయ్య వంశస్థులను రక్షణగా నియమిస్తారు. దానికి అష్ట‌దిగ్భంధ‌నం చేస్తారు. ఆ క‌ల‌శంను నాగ‌భ‌ర‌ణం అంటారు. క‌ల‌శంను త‌మ వశం చేసుకుంటే త‌మ‌కిక తిరుగుండ‌ద‌ని లోకంలోని దుష్ట‌శ‌క్తుల‌న్నీ ప్ర‌య‌త్నాలు మొదలెడతాయి. ఆ కలసం తమ వసం అయితే దేవతల మీద ఆదిపత్యం ఈజీ అని వాటి భావన. దాంతో ఎన్నో దుష్టశక్తులు ఆ కలశాన్ని సొంతం చేసుకోవటానికి యుగయుగాలుగా ట్రైల్స్ వేస్తూంటాయి. అలా ప్రయత్నిస్తున్నవారిలో ఓ ప్రధానమైన దుష్ట శక్తి కపాలి (రాజేష్ వివేక్). ఈ శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) వంశం ఏళ్ళుగా కాపాడుతూ ఉంటుంది. అయితే శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచం నాగాభరణం ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, శక్తి కవచాన్ని కూడా జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి నాగాభరణం కోసం పోరాడుతుంది. అలా తరతరాలుగా పోరాటాలు జరిగేలా చేస్తున్న ఆ నాగ‌భ‌ర‌ణం అర్కియాల‌జీ డిపార్డ్‌మెంట్‌కు ద‌క్కుతుంది. వారు దాన్ని ఢిల్లీ భ‌ద్ర‌ప‌రుస్తారు. చివ‌ర‌కు ఇండియాలో జ‌ర‌గ‌బోయే వ‌ర‌ల్డ్ మ్యూజిక్ కాంపిటీష‌న్‌లో గెలిచిన వారికి నాగ‌భ‌ర‌ణం బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు. దాని కోసం అనేక మంది పోటీలు ప‌డుతుంటారు. నాగచరణ్‌ (దిగంత్‌) ఓ మంచి సింగర్. సంగీతమే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఏ పోటీకి వెళ్లినా అతనిదే విజయం. అది తెలుసుకొని మానస (రమ్య) అతడిని ఇష్టపడుతుంది. ఒక పోటీని ఏర్పాటు చేసి.. అందులో గెలిచే విజేతకి ఆర్కియాలజీ సంస్థకి చెందిన పురాతన కలశం బహుమతిగా అందజేయాలనుకొంటుంది ప్రభుత్వం. చరణ్ కూడా ఆ పోటీలో పాల్గొంటాడు. ఆ కలశం ఎంతో మహిమ కలదని తెలుసుకొన్న వ్యాపారవేత్త ఒబెరాయ్‌ (ముకుల్‌దేవ్‌) నాగచరణ్‌ని సంప్రదిస్తాడు. ఎలాగైనా ఆ కలశాన్ని గెలిచి తనకి ఇవ్వాలని కోరతాడు. నాగచరణ్‌ అందుకు ససేమిరా అంటాడు. దాంతో కక్ష పెంచుకొన్న పారిస్ నుండి ఓ విల‌న్ గ్యాంగ్(ముకుల్ దేవ్‌, ర‌వి కాలే త‌దిత‌రులు) నాగచరణ్‌ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. నాగ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేయాల‌ని నాగ‌మ్మ‌(ర‌మ్య‌) కోరుకుని, చ‌ర‌ణ్ త‌ల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌ను మ‌చ్చిక చేసుకుని వారి గ్యాంగ్‌లో చేరుతుంది. ఎంతో శ‌క్తివంత‌మైన నాగ‌భ‌ర‌ణంను గెలుచుకోవాల‌ని పారిస్ నుండి ఓ విల‌న్ గ్యాంగ్(ముకుల్ దేవ్‌, ర‌వి కాలే త‌దిత‌రులు) ప్ర‌య‌త్నం చేస్తూంటే దాన్ని మానస తిప్పి కొడుతుంది. నాగాభరణం కోసం చ‌ర‌ణ్ టీంను త‌మ కంపెనీ త‌ర‌పున పోటీలో పాల్గొనాల‌ని విలన్స్ అడుగుతారు. కానీ అందుకు చ‌ర‌ణ్ ఒప్పుకోక పోవ‌డంతో చ‌ర‌ణ్ ఫ్రెండ్స్‌ను చంపేస్తారు. అప్పుడు నాగ‌మ్మ పాముగా మారి విల‌న్స్‌ను చంపేస్తుంది. నాగ‌మ్మ మ‌నిషి కాదు, పాము అనే నిజం తెలుసుకున్న చర‌ణ్ ఏం చేస్తాడు? అస‌లు నాగ‌మ్మ ఎవ‌రు? చ‌ర‌ణ్ వ‌ద్ద‌నే ఎందుకు శిష్యురాలుగా చేరుతుంది? అస‌లు ఇంత‌కీ నాగ‌భ‌ర‌ణంను చ‌ర‌ణ్ గెలుచుకున్నాడా? మానస తన శక్తి సామర్థ్యాల్ని కోల్పోయాక ఆమె కోసం వచ్చిన మరో శక్తి ఎవరు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
Read More

నాగభరణం కాస్ట్ & క్రూ

నాగభరణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోడి రామకృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గురుకిరణ్
నిర్మాత సోహాలి అన్సారి, దావల్ గడ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాగభరణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కోడి రామకృష్ణ ఈ సారి ఎందుకనో బలమైన కథ, కథనం పైన కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టారు. కథలేని గ్రాఫిక్స్ రాణించవు అని ఆయనే ఎన్నోసార్లు గతంలో చెప్పి ఉన్నారు. కానీ ఆ బేసిక్ రూల్ ని ఆయనే మరిచి ఈ సినిమాని మలిచారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్ధన్‌ని గ్రాఫిక్స్‌ రూపంలో సృష్టించి చూపించమే ఈ సినిమాకు నిజానికి హైలెట్. ఒక నటుడిని గ్రాఫిక్స్‌ రూపంలో రీక్రియేట్ చేసేనప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా చెబుతుంది. . కథా పరంగా ఓకే అనిపించినా..స్క్రీన్ ప్లే విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవటంతో టార్చల్ లాగ తయారైంది. క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ఆలోచన ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్ట్ తీసేస్తే ఇది అతి సాధారణమైన రొటీన్ సినిమా. కన్నడంలో ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయంటే ఆ ఐడియావల్లే. నాగ‌భ‌ర‌ణం ఇంట్రడక్షన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రారంభమైన ఐదు నిమిషాలు త‌ర్వాత సినిమా ఎటు వెళ్తూందో అర్దం కాదు. ఒక సీన్ కు మరొక సీన్ కు పొంతన కనపడదు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో హీరో, హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, ఫ్యామిలీ డ్రామా స‌రిగా పండ లేదు. ఇక సెకండాఫ్‌లో నాగ‌మ్మ ప్లాష్‌బ్యాక్ చూస్తే అరుంధ‌తి స్ఫూఫ్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా నాగ‌మ్మ వంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను ర‌మ్య స‌రిగా హ్యాండిల్ చేయ‌లేకపోవటం మైనస్ గా నిలిచింది. ఇక దుష్ట‌శ‌క్తులు క‌ల‌శం గురించి చేసే చేసే విన్యాసాలు ఇంట్రస్ట్ కలిగించకుండా, విసుగును తెప్పిస్తాయి. సినిమా హైలెట్స్ చెప్పాలంటే ఇంటర్వెల్ అప్పుడు ఒక పెద్ద పామును వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో చనిపోయిన ఒక సూపర్ స్టార్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించడం వంటివి బాగున్నాయి. సినిమా ఉన్నంతలో గిట్టుబాటు అయ్యేలా చేసాయి.

నాగభరణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాగభరణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+