X
డోరా
Horror | 31 Mar 2017 | A |
Telugu

డోరా స్టోరీ

డోరా సినిమా హార్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, తంబి రామయ్య, హరిష్ ఉత్తమన్, షాన్, తరున్ శత్రియ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దాస్ రామస్వామి నిర్వహించారు మరియు నిర్మాత మల్కపురం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్, మెర్విన్ సంయుక్తంగా సమకుర్చరు. 

కథ

పారిజాతం (నయనతార) ఆమె తండ్రి (తంబి రామయ్య) ది అన్యోన్యమైన కుటుంబం. పుట్టిన కొద్ది నెలలకే బిడ్డను వదిలేసి భార్య వెళ్లిపోవడంతో పారిజాతాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటాడు. ఓ ఘటనలో గుండెకు తీవ్రగాయమై పారిజాతం ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడుతుంది. కథ ఇలా సాగుతుండగా యుక్త వయస్సుకు వచ్చిన కూతురికి పెళ్లి చేసి భారం దించుకోవాలనే ప్రయత్నంలో ఇలవేల్పును దర్శించుకోవాలనుకొంటారు. అందుకోసం టాక్సీల వ్యాపారాన్ని నిర్వహించే తన చెల్లెల్ని ఓ కారు ఇవ్వమని కోరితే పారిజాతం తండ్రిని వారు అవమానిస్తారు. తన మేనత్త మీద కోపంతో సొంతంగా కారు కొని ట్యాక్సీ వ్యాపారాన్ని ప్రారంభించాలని పారిజాతం నిర్ణయిస్తుంది. తాము పొదుపు చేసిన సొమ్ముతో కారును కొనుగోలు చేస్తారు. తమ జీవితంలోకి వచ్చిన పురాతన కారు వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆ కారులో కుక్క రూపంలో ఆత్మ తిరుగుతుంటుంది. ఆ కారులో ప్రయాణిస్తుండగానే పారిజాతం ప్రమేయ లేకుండానే ఆ వాహనం ఓ వ్యక్తిని తొక్కి చంపుతుంది. అదే విధంగా మరో వ్యక్తిని చంపుతుంది. ఆ కారు ఆ ముగ్గురు వ్యకులను ఎందుకు చంపాలనుకున్నది. ఆ కారు వల్ల పారిజాతం పడిన ఇబ్బందులేమిటీ. పారిజాతం గాయపడటానికి ఆ ముగ్గురు వ్యక్తులకు ఏమిటి సంబంధం. ఇలా అనేక ప్రశ్నలకు తెరమీద సమాధానమే డోరా చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+