X
డోరా

డోరా

Horror | 31 Mar 2017 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

డోరా స్టోరీ

డోరా సినిమా హార్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, తంబి రామయ్య, హరిష్ ఉత్తమన్, షాన్, తరున్ శత్రియ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దాస్ రామస్వామి నిర్వహించారు మరియు నిర్మాత మల్కపురం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్, మెర్విన్ సంయుక్తంగా సమకుర్చరు.  కథ పారిజాతం (నయనతార) ఆమె తండ్రి (తంబి రామయ్య) ది అన్యోన్యమైన కుటుంబం. పుట్టిన కొద్ది నెలలకే బిడ్డను వదిలేసి భార్య వెళ్లిపోవడంతో పారిజాతాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటాడు. ఓ ఘటనలో గుండెకు తీవ్రగాయమై పారిజాతం ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడుతుంది. కథ ఇలా సాగుతుండగా యుక్త వయస్సుకు వచ్చిన కూతురికి పెళ్లి చేసి భారం దించుకోవాలనే ప్రయత్నంలో ఇలవేల్పును దర్శించుకోవాలనుకొంటారు. అందుకోసం టాక్సీల వ్యాపారాన్ని నిర్వహించే తన చెల్లెల్ని ఓ కారు ఇవ్వమని కోరితే పారిజాతం తండ్రిని వారు అవమానిస్తారు. తన మేనత్త మీద కోపంతో సొంతంగా కారు కొని ట్యాక్సీ వ్యాపారాన్ని ప్రారంభించాలని పారిజాతం నిర్ణయిస్తుంది. తాము పొదుపు చేసిన సొమ్ముతో కారును కొనుగోలు చేస్తారు. తమ జీవితంలోకి వచ్చిన పురాతన కారు వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆ కారులో కుక్క రూపంలో ఆత్మ తిరుగుతుంటుంది. ఆ కారులో ప్రయాణిస్తుండగానే పారిజాతం ప్రమేయ లేకుండానే ఆ వాహనం ఓ వ్యక్తిని తొక్కి చంపుతుంది. అదే విధంగా మరో వ్యక్తిని చంపుతుంది. ఆ కారు ఆ ముగ్గురు వ్యకులను ఎందుకు చంపాలనుకున్నది. ఆ కారు వల్ల పారిజాతం పడిన ఇబ్బందులేమిటీ. పారిజాతం గాయపడటానికి ఆ ముగ్గురు వ్యక్తులకు ఏమిటి సంబంధం. ఇలా అనేక ప్రశ్నలకు తెరమీద సమాధానమే డోరా చిత్రం.
Read More

డోరా కాస్ట్ & క్రూ

డోరా సిబ్బంది సమాచారం

దర్శకత్వం దాస్ రామస్వామి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వివేక్ , మెర్విన్
నిర్మాత మార్కాపురం శివకుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డోరా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నయన తార తండ్రి తమిళ నటుడు తంబి రామయ్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తంబి రామయ్య చేత కామెడీ చేయాలని ప్రయత్నించిన దర్శకుడు రామసామి ప్రయత్నాలు వికటించాయి. ఆయనతో చేయించిన హాస్యం అభాసుపాలైంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కామెడి చికాకు పెట్టించేలా ఉంది. చిత్రంలో మొదటి భాగం పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్, హత్యలు, ముగ్గురు వ్యక్తుల అరాచకాలతో నడిపించేశాడు. కొందరిపై కారు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుదనే విషయాన్ని చెప్పి ఇంటర్వెల్‌లో దర్శకుడు ఆసక్తి రేపాడు. రెండో భాగంలో కారులో ఆత్మ జీవించడానికి కారణాలను దర్శకుడు చాలా చక్కగా చెప్పాడు. సెకండాఫ్‌లో ఒక చిన్నపాపకు సంబంధించిన ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఇక కథ దూసుకుపోతుందనే ఫీలింగ్‌తో ఉన్న ఆడియెన్స్‌పై దర్శకుడు రోటిన్ కథనంతో విసుగుపుట్టించాడు. ఓ భారీ హిట్‌కు సరిపోయే స్టోరీ లైన్‌కు సరైన కథ, కథనాన్ని అల్లుకోకపోవడంతో డోరా ఓ విభిన్నమైన సినిమాగా కాకుండా సాదాసీదాగా మారిపోయింది. దర్శకుడు రామసామి సరైన చర్యలు తీసుకొంటే ఓ మంచి చిత్రంగా మారడానికి అవకాశం ఉండేది. అయితే పేలవమైన కథ, కథనాలున్నప్పటికీ నయనతార తన అద్భుతమైన నటనతో సినిమాను కాపాడే ప్రయత్నం చేసింది.

డోరా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

డోరా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+