నీకు నాకు డాష్ డాష్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్, నందిత, చౌదరి, పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, బెనర్జీ, తనికెళ్ల భరణి, వేణు, సుమన్‌శెట్టి, ఉత్తేజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: తేజ నిర్వహించారు మరియు నిర్మాత వి ఆనంద్ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
శివ (పిన్స్) తమ కుటుంబ అప్పులు తీర్చటం కోసం బాపినీడు (చౌదరి), చిట్టితల్లి (తీర్థ)నిర్వహించే నకిలీ మద్యం తయారీ కేంద్రంలో చేరతాడు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న గాయత్రి (నందిత)కి... శివ తెగ నచ్చేస్తాడు. దాంతో ఆ ప్రేమని శారీరిక కలయిక దాకా తీసుకువస్తుంది. తర్వాత గాయత్రి గర్భం దాల్చిన విషయం లేడీ విలన్ చిట్టితల్లికి తెలిసి చావబాదుతుంది. అదే సమయంలో శివ కూడా అక్కడ డబ్బుని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం విలన్స్ కి తెలిసి వెంబడిస్తారు. అక్కడ నుంచి ఆ జంట ఎలా తప్పించుకుని బయిటపడింది... అసలు శివకు డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.