నేను శైలజ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయకుమార్, రోహిణి, కృష్ణ చైతన్య, ప్రదీప్ రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల నిర్వహించారు మరియు నిర్మాత శ్రవంతి రవికిశోర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
హరి(రామ్) కి చిన్నప్పటినుంచీ కనపడ్డ అమ్మాయికల్లా ప్రపోజ్ చేయటం..నో చెప్పించుకోవటం అలవాటే. ఇలా రొటీన్ గా నో చెప్పించుకుంటున్న హరికి అదే ఊళ్లో ఉంటున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెను చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన హరి...తర్వాత అతని కుటుంబం వేరే ఊరికి షిప్ట్ అవటంతో దూరం అవుతాడు. ఈ మనసంతా నువ్వే లవ్ స్టోరీ ...వీళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ మొదలవుతుంది. పెరిగి పెద్దైన శైలజ (కీర్తి సురేష్) అతనికి అనుకోకుండా కనిపిస్తుంది. ఆమెను పరిచయం చేసుకుని, ఇంప్రెస్ చేసి, ట్రై చేసి ప్రపోజ్ చేస్తాడు. అయితే శైలజ...ఐ లవ్ యు..బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ లవ్ యు అని కన్ఫూజ్ డైలాగు చెప్పి..దూరం అయిపోతుంది. ఆమె అలా ఎందుకు హరికి కన్ఫూజ్ డైలాగు చెప్పింది. ఆమెకు ఏదన్నా సమస్య ఉందా...ఉంటే హరి దాన్ని ఎలా తీర్చాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు అనే విషయాలుతెలియాలంటే...ఈ హరి కథ మీరు తెరపై చూడాల్సిందే.