నెక్ట్స్ నువ్వే స్టోరి

  నెక్ట్స్ నువ్వే సినిమా హర్రర్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, వైభవి, రష్మీ, వెన్నెల కిశోర్, పృథ్వి, బ్రహ్మాజి, అదుర్స్ రఘు, జయప్రకాష్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి ప్రభాకర్ వహించారు మరియు నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు. 

  కథ

  ప్రముఖ దర్శకులు బాపు, రాఘవేంద్రరావు, రాజమౌళిలా గొప్ప దర్శకుడు కావాలనే కోరిక ఉన్న కిరణ్ (ఆది) ఓ టెలి సీరియల్ డైరెక్టర్. ఓ గుండా (జయప్రకాశ్) గ్యాంగ్‌కు మస్కా కొట్టి టెలిసీరియల్ నిర్మించే పనిలో పడుతాడు. కానీ ఆ సీరియల్ ఎందుకో ఆగిపోవడంతో కష్టాల్లో పడుతాడు. సీరియల్ కోసం పెట్టిన డబ్బులు వెనకకు ఇవ్వాలని గుండాలు కిరణ్‌ను వేధిస్తుంటారు. ఇలాంటి సమయంలో తన పేరిట ఓ ప్యాలెస్ ఉంది అనే లేఖను తండ్రి (పోసాని కృష్ణమురళి) పంపుతాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి తన ప్రేయసి (స్మిత)తో వెళ్లిన కిరణ్‌కు భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఓ దెయ్యం (హిమజ) వీళ్లను వెంటాడుతుంటుంది. హిమజ ఎందుకు దెయ్యం అయింది? వీరిని ఎందుకు వేధించింది? ఆ దెయ్యం బారి నుంచి ఎలా తప్పించుకొన్నారు? ఆ ప్యాలెస్‌కు శరత్ (బ్రహ్మాజీ), రష్మీ (రష్మీ గౌతమ్)కు ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే నెక్ట్స్ నువ్వే సినిమా కథ.
  **Note:Hey! Would you like to share the story of the movie నెక్ట్స్ నువ్వే with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X