X
తెలుగు » సినిమాలు » నెక్ట్స్ నువ్వే
నెక్ట్స్ నువ్వే

నెక్ట్స్ నువ్వే

Horror | Romance | 03 Nov 2017 | A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

నెక్ట్స్ నువ్వే స్టోరీ

నెక్ట్స్ నువ్వే సినిమా హర్రర్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, వైభవి, రష్మీ, వెన్నెల కిశోర్, పృథ్వి, బ్రహ్మాజి, అదుర్స్ రఘు, జయప్రకాష్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పి ప్రభాకర్ వహించారు మరియు నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.  కథ ప్రముఖ దర్శకులు బాపు, రాఘవేంద్రరావు, రాజమౌళిలా గొప్ప దర్శకుడు కావాలనే కోరిక ఉన్న కిరణ్ (ఆది) ఓ టెలి సీరియల్ డైరెక్టర్. ఓ గుండా (జయప్రకాశ్) గ్యాంగ్‌కు మస్కా కొట్టి టెలిసీరియల్ నిర్మించే పనిలో పడుతాడు. కానీ ఆ సీరియల్ ఎందుకో ఆగిపోవడంతో కష్టాల్లో పడుతాడు. సీరియల్ కోసం పెట్టిన డబ్బులు వెనకకు ఇవ్వాలని గుండాలు కిరణ్‌ను వేధిస్తుంటారు. ఇలాంటి సమయంలో తన పేరిట ఓ ప్యాలెస్ ఉంది అనే లేఖను తండ్రి (పోసాని కృష్ణమురళి) పంపుతాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి తన ప్రేయసి (స్మిత)తో వెళ్లిన కిరణ్‌కు భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఓ దెయ్యం (హిమజ) వీళ్లను వెంటాడుతుంటుంది. హిమజ ఎందుకు దెయ్యం అయింది? వీరిని ఎందుకు వేధించింది? ఆ దెయ్యం బారి నుంచి ఎలా తప్పించుకొన్నారు? ఆ ప్యాలెస్‌కు శరత్ (బ్రహ్మాజీ), రష్మీ (రష్మీ గౌతమ్)కు ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే నెక్ట్స్ నువ్వే సినిమా కథ.
Read More

నెక్ట్స్ నువ్వే కాస్ట్ & క్రూ

నెక్ట్స్ నువ్వే సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రభాకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నెక్ట్స్ నువ్వే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరో ఆది పడే కష్టాలతో నెక్ట్స్ నువ్వే చిత్రం ప్రారంభమవుతుంది. తనకు వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి ప్రవేశించి దానిని రిసార్టుగా మార్చడం, ఆ తర్వాత దానిలో వచ్చిన గెస్టులు మృత్యు బారిన పడటంతో కథ వేగం పుంజుకొంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు రొటీన్‌గా సీన్లు కొంత అసహనం కలిగించేలా ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్‌లో ఓ టిస్ట్ ఇవ్వడంతో రెండో భాగంలో ఆసక్తి పెరుగుతుంది. కథలో ముడి విప్పడానికి రెండో భాగంలో కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నప్పటికీ.. అవసరాల శ్రీనివాస్ ఎపిసోడ్‌తో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పటిలానే రొటీన్ సీన్లు విసుగు పుట్టిస్తాయి. కథలో వేగం తగ్గుతుంది. క్లైమాక్స్ కోసం సన్నివేశాలను సాగదీసినట్టు ఉంటాయి. కాకపోతే కామెడీతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. కాకపోతే కొత్త తరహా సీన్లు ఉండి ఉంటే హారర్ సినిమాల్లో నెక్ట్స్ నువ్వే మరోస్థాయి చిత్రంగా మారే అవకాశం ఉండేది. పాత్రలు వచ్చిపోతూ కనిపిస్తాయి గానీ వాటిలో పెద్దగా క్లారిటీ కనిపించదు. లాజిక్కులు ఉండవు. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం.

నెక్ట్స్ నువ్వే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • superp movie

×
2.6 /5 Your Rating

నెక్ట్స్ నువ్వే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+