Telugu » Movies » Ninnu Kori » Story

నిన్ను కోరి (U)

సినిమా శైలి

Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

07 Jul 2017
కథ
నిన్ను కోరి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నేచురల్ స్టార్ నాని, నివేద థామస్ హీరో హీరోయిన్లుగా ఇంకా కీలకమైన పాత్రలలో ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృద్వీ, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్ రాజ్, కేదార్ శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తిక్ ఘంటమనేని స్వరాలు అందించారు.


కథ

ఉమా అలియాస్ ఉమా మహేశ్వర్‌రావు (నాని) వైజాగ్ యూనివర్సిటీ స్టూడెంట్. పల్లవి ఓ కాలేజిలో చదివే స్టూడెంట్. పల్లవికి డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. స్వతహాగా ఉమ మంచి డ్యాన్సర్ కావడంతో పల్లవి ఆయన వద్ద డ్యాన్సర్‌గా చేరుతుంది. ఉమ, పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ దశలో ఉమ ఏకంగా పల్లవి ఇంటిపై ఉండే పెంట్ హౌస్‌లో అద్దెకు దిగుతాడు. దాంతో పల్లవి తండ్రి, బావ (మురళీ శర్మ, పృథ్వీ)తో పరిచయం పెరుగుతుంది. పల్లవి ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోతాడు. అన్ని సక్రమంగా సాగిపోతుండగానే ఉమ ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం పల్లవిని వదిలేసి వెళ్తాడు. ఈలోగా పల్లవి పెళ్లి (అరుణ్)తో జరిగిపోతుంది. పల్లవి, అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. పీహెచ్‌డీ పూర్తి చేసుకొన్న ఉమ కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ఓ దశలో పల్లవికి దూరమైన బాధతో ఉమ ఉద్యోగం వదిలేసి తాగుడు బానిస అవుతాడు. ఉమ గురించి తెలుసుకొన్న పల్లవి.. అరుణ్‌కు ఒప్పించి తన ఇంట్లోకి తీసుకొస్తుంది. నేను లేకుండా నీవు సుఖంగా బతుకలేవు అని పల్లవితో ఉమ అంటాడు. పెళ్లి తర్వాత మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. కావాలంటే నీవు మమ్మల్ని చూస్తే అది నీకే అర్థం అవుతుంది అని చెప్తుంది. కానీ ఉమ అంత తేలిగ్గా నమ్మడు. ఈ పరిస్థితుల్లో అరుణ్ ఒప్పించి ఉమను తన ఇంట్లో పదిరోజులు ఉండేందుకు పల్లవి తీసుకొస్తుంది. ఈ లోగా అరుణ్‌కు మరో మహిళతో సంబంధం ఉందనే విషయం తెలుస్తుంది. మరో మహిళతో అరుణ్‌కు నిజంగానే రిలేషన్ ఉందా? అరుణ్‌కు అలాంటి రిలేషన్ ఉంటే ఏమైంది ? ఆ పది రోజుల్లో అరుణ, పల్లవిల మధ్య ప్రేమను చూసి మనసు మార్చుకొన్నాడా? పల్లవి, ఉమ మధ్య ఉన్న ప్రేమను చూసి అరుణ్ మనసు మార్చుకొన్నాడా? చివరకు పల్లవి, ఉమ ఒక్కటవుతారా? లేక పల్లవి, అరుణ్ భార్యభర్తలుగానే మిగిలిపోతారా? అనే ప్రశ్నలకు సమాధానమే నిన్ను కోరి చిత్రం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu