X
తెలుగు » సినిమాలు » నిన్ను కోరి
నిన్ను కోరి

నిన్ను కోరి

Romance | 07 Jul 2017 | U |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

నిన్ను కోరి స్టోరీ

నిన్ను కోరి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నేచురల్ స్టార్ నాని, నివేద థామస్ హీరో హీరోయిన్లుగా ఇంకా కీలకమైన పాత్రలలో ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృద్వీ, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్ రాజ్, కేదార్ శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వాణ వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తిక్ ఘంటమనేని స్వరాలు అందించారు. కథ ఉమా అలియాస్ ఉమా మహేశ్వర్‌రావు (నాని) వైజాగ్ యూనివర్సిటీ స్టూడెంట్. పల్లవి ఓ కాలేజిలో చదివే స్టూడెంట్. పల్లవికి డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. స్వతహాగా ఉమ మంచి డ్యాన్సర్ కావడంతో పల్లవి ఆయన వద్ద డ్యాన్సర్‌గా చేరుతుంది. ఉమ, పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ దశలో ఉమ ఏకంగా పల్లవి ఇంటిపై ఉండే పెంట్ హౌస్‌లో అద్దెకు దిగుతాడు. దాంతో పల్లవి తండ్రి, బావ (మురళీ శర్మ, పృథ్వీ)తో పరిచయం పెరుగుతుంది. పల్లవి ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోతాడు. అన్ని సక్రమంగా సాగిపోతుండగానే ఉమ ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం పల్లవిని వదిలేసి వెళ్తాడు. ఈలోగా పల్లవి పెళ్లి (అరుణ్)తో జరిగిపోతుంది. పల్లవి, అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. పీహెచ్‌డీ పూర్తి చేసుకొన్న ఉమ కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ఓ దశలో పల్లవికి దూరమైన బాధతో ఉమ ఉద్యోగం వదిలేసి తాగుడు బానిస అవుతాడు. ఉమ గురించి తెలుసుకొన్న పల్లవి.. అరుణ్‌కు ఒప్పించి తన ఇంట్లోకి తీసుకొస్తుంది. నేను లేకుండా నీవు సుఖంగా బతుకలేవు అని పల్లవితో ఉమ అంటాడు. పెళ్లి తర్వాత మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. కావాలంటే నీవు మమ్మల్ని చూస్తే అది నీకే అర్థం అవుతుంది అని చెప్తుంది. కానీ ఉమ అంత తేలిగ్గా నమ్మడు. ఈ పరిస్థితుల్లో అరుణ్ ఒప్పించి ఉమను తన ఇంట్లో పదిరోజులు ఉండేందుకు పల్లవి తీసుకొస్తుంది. ఈ లోగా అరుణ్‌కు మరో మహిళతో సంబంధం ఉందనే విషయం తెలుస్తుంది. మరో మహిళతో అరుణ్‌కు నిజంగానే రిలేషన్ ఉందా? అరుణ్‌కు అలాంటి రిలేషన్ ఉంటే ఏమైంది ? ఆ పది రోజుల్లో అరుణ, పల్లవిల మధ్య ప్రేమను చూసి మనసు మార్చుకొన్నాడా? పల్లవి, ఉమ మధ్య ఉన్న ప్రేమను చూసి అరుణ్ మనసు మార్చుకొన్నాడా? చివరకు పల్లవి, ఉమ ఒక్కటవుతారా? లేక పల్లవి, అరుణ్ భార్యభర్తలుగానే మిగిలిపోతారా? అనే ప్రశ్నలకు సమాధానమే నిన్ను కోరి చిత్రం.
Read More

నిన్ను కోరి కాస్ట్ & క్రూ

నిన్ను కోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం శివ నిర్వాణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నిన్ను కోరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నిన్ను కోరి సినిమా పల్లవి, అరుణ్ వివాహ వార్షికోత్సవంతో ప్రారంభమవుతుంది. వారి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చకచకగా సన్నివేశాల రూపంలో సాగిపోతాయి. కానీ తన ప్రేమికుడు నాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొన్న నివేదా భర్త ఆదికి చెప్పకుండా అక్కడకు వెళ్తుంది. అక్కడే ప్రేక్షకుడికి ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ అమెరికా నుంచి వైజాగ్‌కు చేరుకొంటుంది. తొలిభాగంలో నాని, నివేద ప్రేమ, వారి రొమాన్స్ చక్కగా చిత్రీకరించాడు. ఓ కారణంగా తన కెరీర్‌ కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడిన నాని ఢిల్లీకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నివేద, ఆదిల పెళ్లి జరిగిపోవడం లాంటిని మంచి కథనంతో సినిమా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ ముందు సీన్‌లో నివేదా, ఆది ఇంటికి నాని చేరుకోవడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. రెండో భాగంలో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. నివేదా, ఆది ఎప్పుడు విడిపోతాడా అని నాని ఎదురు చూస్తుంటాడు. తమ ప్రేమను చూసి నాని ఎప్పుడు రియలైజ్ అవుతాడు అని నివేదా ఆది చూస్తుంటాడు. ఇలా మూడు పాత్రల మధ్య సంఘర్షణతో సినిమా సాగుతుంటుంది. కానీ రొటీన్ కథకు ఎలాంటి నావెల్ ట్రీట్‌మెంట్ లేకపోవడంతో సినిమా నత్త నడకన సాగినట్టు అనిపిస్తుంది. సినిమాను క్లైమాక్స్ వరకు లాగడానికి అమెరికాలో బ్రేకప్ వ్యవహారాలకు సంబంధించిన రెండు ఏపిసోడ్స్‌తో కాలక్షేపం జరుగుతుంది. కానీ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడంతో చాలా రొటీన్ వ్యవహారంగా సాగిపోతుంటుంది. ఓ దశలో ఇదే గొడవరా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. చివరకు రొటీన్ ముగింపుతో నిన్ను కోరి ముగియడంతో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. చాలా రొటీన్ కథకు నాని, నివేదా, ఆది, మురళీశర్మ లాంటి టాలెంటెడ్ నటులతో సినిమా నిలబడిందనే ఫీలింగ్ కలుగుతుంది.

నిన్ను కోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

నిన్ను కోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+