నోటా సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్, ఎమ్ ఎస్ భాస్కర్, సంచన నటరాజన్, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆనంద్ శంకర్ వహించారు మరియు నిర్మాత కె ఇ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు.
కథ
సీఎం వాసుదేవ్ (నాజర్) కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ) లండన్‌లో గేమ్ డెవలపర్. అమ్మాయిలు, మందు, జల్సాలతో మునిగి తేలే వరుణ్ తన తండ్రి అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో అనూహ్య పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన తర్వాత తన తండ్రినే వ్యతిరేకించాల్సి వస్తుంది. తన కొడుకునే పదవి నుంచి దింపడానికి తండ్రి ప్రయత్నిస్తాడు. తన తండ్రి ఎత్తులకు పైఎత్తు వేసి రాజకీయాలపై కనీస అవగాహన లేని వరుణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా చక్కదిద్దారు. ప్రత్యర్థి రాజకీయ నేతలు సాగించే వ్యూహాలను ఎలా చిత్తు చేశాడు? జర్నలిస్టు (మెహ్రీన్)తో వరుణ్‌కు ఉన్న సంబంధమేమిటి? మహేంద్ర (సత్యరాజ్), సీఎంకు ఉన్న గొడవ ఏమిటి? కుళ్లు, కుట్రలతో ఉన్న రాజకీయాల్లో వరుణ్ ఎలా రాణించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ.