ఒక లైలా కోసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టెనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, పూజా హేగ్డే, సుమన్, బ్రహ్మనందం, ఆలీ, మరియు నాజర్, సుధ, అజై, వీళ్ళందరు ముఖ్య పాత్రాలలొ నటించారు. ఈ సినిమాకు దర్సకత్వం విజై కుమార్ కొండ నిర్వహిస్తున్నారు, నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. సంగీతదర్సకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాల్లు అందించారు.
కథ
జాబ్ వద్దనుకుని టూర్ కి బయిలు దేరిన కార్తీక్ (నాగ చైతన్య) కి నందన(పూజా హేగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఫిక్సైతాడు కార్తీక్. అయితే ఆమె మాత్రం అతన్ని కొన్ని విచిత్రమరైన పరిస్దితుల్లో అతన్ని దూరం నుంచి చూసి తనకు తాను వేరే విధంగా ఊహించుకని... ద్వేషం పెంచుకుంటుంది. ఇది తెలియని కార్తీక్ తర్వాత లవ్ ప్రపోజ్ చేసి దెబ్బతింటాడు. ఈ లోగా వీరిద్దరి ఇంట్లో వాళ్ళు వీరికి పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తారు.
ఆమె పై ప్రేమతో కార్తీక్, తండ్రి మాట కాదనలేక నందన పెళ్ళికి ఒప్పుకుంటారు. అప్పుడు కార్తీక్ ఓ నిర్ణయం తీసుకుంటాడు ఈ పెళ్లి అయ్యేలోగా ఎలాగైనా ఆమెను తన ప్రేమలో పడేయాలని...అలాగే నందన కూడా ఓ నిర్ణయం తీసుకుంటుంది...ఎలగైనా ఈ పెళ్లి ఆపాలి అని...వీరిద్దరిలో ఎవరి ప్రయత్నం ఫలించింది...చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.