ఒక మనసు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, నిహారిక కొణిదెల, ప్రగత్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామరాజు నిర్వహించారు మరియు నిర్మాత మధుర శ్రీదర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌష్యప్ స్వరాలు సమకుర్చరు.
కథ
పొలిటీషన్ అవ్వాలనే కోరిక ఉన్న సూర్య (నాగశౌర్య) విజయనగరం గవర్నమెంట్ హాస్పటిల్ లో హౌస్ సర్జన్ గా చేస్తున్న సంధ్య (నీహారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఇతనితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంది. ప్రేమ డైలాగులు చెప్పుకుంటూ సాగిపోతున్న ఇద్దరి ప్రేమ కథ ఓ కొలిక్కి వస్తుందనగా సూర్య తను రాజకీయంగా ఎదగటానికి డబ్బు అవసరమై చేసిన ఓ సెటిల్ మెంట్ తో జైలుకు వెళతాడు. తర్వాత బెయిల్ మీద వచ్చిన అతనికి తన ప్రేమను వదులుకుంటేనే కేసు నుంచి బయిటపడి, పొలిటీషన్ గా సెటిలయ్యే ఆప్షన్ ఎదురౌతుంది. అటువంటి స్దితిలో సూర్య ఏం చేసాడు..సంధ్య ఏమంది..చివరకి ఈ లవ్ స్టోరీ ఏ ముగింపుకు చేరుకుంది అనేది మిగతా కథ.