ఒక్కడినే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్ , నిత్యామీనన్, నాగబాబు, చంద్రమోహన్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాగ నిర్వహించారు మరియు నిర్మాత సి వి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
విదేశాల్లో చదువుకుంటున్న శైలజ(నిత్యామీనన్) హ్యాలిడేస్ కు ఇంటికి వైజాగ్ వస్తుంది. అక్కడ ఆమెకు ఐఎఫ్ ఎస్ ట్రైనింగ్ లో ఉన్న సూర్యం(నారా రోహిత్)పరిచయమవుతాడు. వీరి పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకుందామనుకునే దాకా వస్తుంది. ఈ లోగా ఆమెకు సూర్యం గురించి ఓ నిజం తెలుస్తుంది. మరో ప్రక్క ఆమె ఎదురుగా కొన్ని హత్యలు జరుగుతాయి. ఇంతకీ ఆ హత్యలకూ సూర్యంకు సంభంధం ఉందా...కావాలనే సూర్యం ఆమె జీవితంలో ప్రవేశించాడా..ఇంతకూ సూర్యం ఎవరు...అతని టార్గెట్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.