ఒంగోలు గిత్త సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ తదితరులు నటించారు. ఈ సినిమాకికథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చరు.
కథ
దొరబాబు అలియాస్ వైట్(రామ్) చిన్నప్పుడే ఎక్కడినుంచో పారిపోయి వచ్చి ఒంగోలు మార్కెట్ యార్డ్ కి చేరతాడు. అతని మొండితనం, ధైర్యంతో ఆ మార్కెట్ యార్డ్ లో హీరోలా ఎదిగి, సెటిలవుతాడు. ఆ మార్కెట్ యార్డ్ కి ఛైర్మన్ ఆదికేశవ (ప్రకాష్ రాజ్). ప్రపంచం ఎదురుగా.. పెద్దమనిషిగా, మంచి వ్యక్తిగా నటించే ఆదికేశవ... నిజానికి ఓ పెద్ద విలన్. ఆది కేశవులు కూతురు సంధ్య(కృతి కర్భంధ)తో వైట్ ప్రేమలో పడి... దాన్ని తన తెలివి తేటలతో పెళ్లి దాకా తెచ్చుకుంటాడు. ఈ లోగా లోకల్ ఎమ్మల్యే (ఆహుతి ప్రసాద్) ఆ మార్కెట్ యార్డ్ ని వేరే వారితో చేతులు కలిపి షిప్ట్ చేయాలనుకుంటాడు. అందుకు సహకరించటానికి ఆదికేశవ ఒఫ్పుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న వైట్ ఎలా రియాక్ట్ అయ్యాడు. అసలు చిన్నప్పుడే ఆ మార్కెట్ యార్డ్ ని వెతుక్కుంటూ రావటానికి కారణమేంటి... ఆది కేశవకి ఎలా బుద్ది చెప్పి.. అతని అసలు స్వరూపం ప్రపంచానికి ఎలా బహిర్గతం చేసాడు వంటి విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.