ఆపరేషన్ గోల్డ్ ఫిష్ (2019)(U/A)
Release date
18 Oct 2019
genre
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ స్టోరి
ఆపరేషన్ గోల్డ్ ఫిస్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, సత్య కార్తీక్, నిత్య నరేష్, సషా చేత్రి, మనోజ్ నందన్, పార్వతీశం, కృష్ణుడు, అనిష్ కురువిల్ల, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడివి వహించారు మరియు నిర్మాతలు ప్రతిభ అడివి, కత్త అశిస్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పకాల అందించారు.
కథ
కశ్మీర్ పండితులు, ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అర్జున్ పండిట్(ఆది సాయి కుమార్) ఎన్ఎస్జీ (జాతీయ భద్రతాదళం)లో ఆఫీసర్‌గా పనిచేస్తాడు. తన తల్లిదండ్రులు కాశ్మీరీ పండితులు కావడంతో ఘాజీ బాబా(అబ్బూరి రవి) చంపేస్తాడు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘాజీ బాబాను అర్జున్ బంధిస్తాడు. అయితే అతన్ని విడిపించడానికి ఫారుఖ్ (మనోజ్ నందం) ఆపరేషన్ గోల్డ్‌ఫిష్‌ను ప్రారంభిస్తాడు. ఉగ్రవాది అయిన ఫారుఖ్ చేసే ఆ ఆపరేషన్‌లో గోల్డ్ ఫిష్ ఎవరు? గోల్డ్ ఫిష్‌ను కాపాడటానికి అర్జన్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ కథలో కార్తీక్ రాజు, సాల్మాన్ (నూకరాజు) , తానియా (సాషా ఛెత్రీ), నిత్య (నిత్యా నరేష్) పాత్రలేంటి? చివరకు ఘాజీ బాబాను ఏం చేశాడు? అనేవి తెరపై చూడాలి.
**Note:Hey! Would you like to share the story of the movie ఆపరేషన్ గోల్డ్ ఫిష్ with us? Please send it to us ([email protected]).