పాగల్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, మహేస్ ఆచంట, మేఘా లేఖ, ఇంద్రజా శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నరేష్ కుప్పిలి
వహించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
కథ
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి (భూమిక) క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో చిన్నతనంలోనే ప్రేమ్ (విశ్వక్ సేన్) అనాధగా మారిపోతాడు. ప్రేమను పంచే వారు కరువు కావడంతో నిర్వేదానికి గురి అవుతాడు. దాదాపు 1000 మందికిపైగా ప్రేమించినా.. తల్లి లాంటి ప్రేమను కురిపించే.. తల్లిలా చూసుకొందామనే ప్రియురాలు దొరకదు. ఇలాంటి పరిస్తితుల్లో కాబోయే ఎమ్మెల్యే రాజీ (మురళీశర్మ)ను ప్రేమిస్తాడు. ఆయన ఐ లవ్ యూ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తాడు. కాబోయే ఎమ్మెల్యేను ప్రేమ్ ఎందుకు ప్రేమించాడు? రాజీతో ఎందుకు ఐ లవ్ యూ చెప్పించుకొన్నాడు. మగవాడితో ఎందుకు తేడాగా వ్యవహారించాడు. కథలో తీరా (నివేదా పేతురాజ్)కు ప్రేమ్‌కు రిలేషన్ ఏమిటి? తల్లిలా ప్రేమను కురిపించే ప్రియురాలు ప్రేమ్‌కు దొరికిందా? అనాధగా ఫీలైన ప్రేమ్ తన తోడును ఎలాంటి పరిస్థితులను ఎదురించి దక్కించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే పాగల్ సినిమా కథ.