twitter

    పలాస 1978 స్టోరి

    పలాస 1978 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరుణా కుమార్ వహించారు. నిర్మాత అట్లూరి వరప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు.

    కథ 

    80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు. అలాంటి క్రమంలో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే గ్రామ యువకులు మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) గొంతు లెవనెత్తుతారు. దాంతో అగ్రవర్ణాలకు, వెలివేయబడిన కులాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే పెద్ద షావుకారు, చిన షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అన్యాయాలను ఎదురించడం మొదలుపెడుతారు. కళాకారులైన మోహన్ రావు, రంగారావు రౌడీలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద షావుకారుకు, చిన్న షావుకారు మధ్య విభేదాలు ఏ మేరకు ఊరిలో చిచ్చుపెట్టాయి? పెద్ద షావుకారును చంపడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? చిన్న షావుకారును ఇద్దరు యువకులు ఎలా ఎదురించారు? ఫ్యాక్షన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ (విజయ్ రామ్) పరిస్థితి చివరు ఏమైంది? అగ్రకులాలను ఎదురించే క్రమంలో మోహన్ రావు, రంగారావు ఎలాంటి త్యాగాలకు పాల్పడాల్సి వచ్చిందనే పలు ప్రశ్నలకు సమాధానమే పలాస 1978. 
    **Note:Hey! Would you like to share the story of the movie పలాస 1978 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X