పంచతంత్ర కథలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నోయల్ సీన్, నందినీ రాయ్, సాయి రోనక్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదాటి, సదియా, అజయ్ కథుర్వార్, గీతా భాస్కర్, జోర్దార్ సుజాత, శశికళ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగనమోని శేఖర్ వహించారు. నిర్మాత డీ మధు నిర్మించారు. సంగీతం సయ్యద్ కమ్రాన్ అందించారు.
కథ
పంచతంత్ర కథలు అంథాలజీలో మొదటి ఎపిసోడ్‌గా అడ్డ కత్తెర. కుల వైషమ్యాల కథా నేపథ్యంతో ఈ కథను తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. క్షవరం పనిచేసే నాయీ బ్రాహ్మణుడు కృష్ణ (నిహాల్) తాను ఉంటున్న ప్రాంతంలోనే ఉండే సత్య (సాదియ అన్వర్)తో ప్రేమలో పడుతాడు. కులం వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. అయితే పెద్దల నుంచి ఎదురైన సమస్యలు, ఆటంకాలను ఎలా ఎదురించారు? పెద్దల మనసులను ఎలా గెలుచుకొన్నారు. వారి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనే ప్రశ్నకు సమాధానం అడ్డ కత్తెర కథ.