X
తెలుగు » సినిమాలు » పంచతంత్ర కథలు
పంచతంత్ర కథలు

పంచతంత్ర కథలు

Drama | 16 Jul 2022 | U/A | 143 Mins
Telugu

2.8 /5 Users

3 /5 Filmibeat

పంచతంత్ర కథలు స్టోరీ

పంచతంత్ర కథలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నోయల్ సీన్, నందినీ రాయ్, సాయి రోనక్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదాటి, సదియా, అజయ్ కథుర్వార్, గీతా భాస్కర్, జోర్దార్ సుజాత, శశికళ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగనమోని శేఖర్ వహించారు. నిర్మాత డీ మధు నిర్మించారు. సంగీతం సయ్యద్ కమ్రాన్ అందించారు.  కథ పంచతంత్ర కథలు అంథాలజీలో మొదటి ఎపిసోడ్‌గా అడ్డ కత్తెర. కుల వైషమ్యాల కథా నేపథ్యంతో ఈ కథను తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. క్షవరం పనిచేసే నాయీ బ్రాహ్మణుడు కృష్ణ (నిహాల్) తాను ఉంటున్న ప్రాంతంలోనే ఉండే సత్య (సాదియ అన్వర్)తో ప్రేమలో పడుతాడు. కులం వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. అయితే పెద్దల నుంచి ఎదురైన సమస్యలు, ఆటంకాలను ఎలా ఎదురించారు? పెద్దల మనసులను ఎలా గెలుచుకొన్నారు. వారి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనే ప్రశ్నకు సమాధానం అడ్డ కత్తెర కథ.
Read More

పంచతంత్ర కథలు కాస్ట్ & క్రూ

పంచతంత్ర కథలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం గంగనమోని శేఖర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సయ్యద్ కమ్రాన్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పంచతంత్ర కథలు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పంచతంత్ర కథలు అంథాలజీ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. మానవ సంబంధాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భావోద్వేగం, ఫీల్‌గుడ్ అంశాలను జోడించి తెరక్కించిన అద్బుతమైన వెండితర కథా సంకలనం. నిర్మాతగా మారిన వ్యాపారవేత్త డీ మధు తన సన్నిహితుల కోసం, యువ టాలెంట్‌ను ప్రోత్సాహించేందుకు పంచతంత్ర కథలు తెరకెక్కించినప్పటికీ.. అతడికి సినిమాపై ఉన్న అభిరుచి తెలియజెప్పింది. సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చాలా బాగుంది. వివిధ ఫ్లేవర్స్‌తో ఉండే కథకు పలు రకాల వేరియేషన్స్‌తో ఉన్న మ్యాజిక్‌ను అందించడంలో సయ్యద్ సక్సెస్ అయ్యాడు. విజయ్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా వరగంటి శ్రీనివాస్ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. అన్ని విభాగాలను సమన్వయం చేయడంతోపాటు దర్శకత్వం బాధ్యతలను చక్కగా శేఖర్ నిర్వహించాడు.అజార్ షేక్ కొత్తవాడైనప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న రచయితగా డైలాగ్స్ అందించారు. గుండె తలుపును తట్టిలా భావోద్వేగాన్ని నింపడంలో అజర్ సఫలమయ్యాడు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, అద్భుతమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. భావోద్వేగతంతో సాగే ఈ కథలు.. మీ జీవితంలోని చాలా సంఘటనలు, అనుభూతులు ఎక్కడో ఒకచోట ఈ సినిమాలో ఎదురుపడుతాయి. గుండెను పిండేసేలా చేయడమే కాకుండా మీ ఇంటి వరకు వెంటాడుతాయి. చక్కటి ఉన్నత విలువలు ఉన్న పంచతంత్ర కథలను మిస్ చేసుకోకండి.

పంచతంత్ర కథలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

పంచతంత్ర కథలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+