పాండురంగడు సినిమా పౌరాణిక చిత్రం ఇందులో బాలకృష్ణ, స్నేహ, టబు, కె.విశ్వనాధ్, శివ పార్వతి, బాలయ్య, జెన్నీ, మోహన్ బాబు, వై.విజయ ,గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, సుబ్బరాయశర్మ, ఎల్.బి.శ్రీరామ్, భారవి, సుహాసిని, వేద, అపూర్వ, ఆలీ, సునీల్, ధర్మవరపు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే,దర్శకత్వం :కె.రాఘవేంద్రరావు నిర్వహించారు మరియు నిర్మాత కె కృష్ణమోహన్ నిర్మించరు. ఈ సినిమాకి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
'మాతాపితురల సేవే మాథవ సేవ' అనే సత్యాన్ని చాటే ఈ కథ మహారాష్ట్రలోని పండరీపురం నేపథ్యంలో సాగుతుంది. పుండరీకుడు (బాలకృష్ణ) స్త్రీ లోలుడు, వ్యసనపరుడు, కన్నవారిని (కె.విశ్వనాధ్,శివ పార్వతి), కట్టుకున్న భార్య లక్ష్మిని(స్నేహ) పట్టించుకోకుండా అమృతం (టబు)అనే వేశ్య చుట్టూ తిరుగుతూంటాడు. కాని ఆమె మాత్రం తన బుద్ది పోనిచ్చుకోక అతను ఎప్పటికైనా చేజారతాడని మాయ చేసి ఆస్తి రాయించుకుని విష ప్రయోగం చేస్తుంది. ప్రాణాపాయమైన ఆ స్ధితి నుండి అతను ఎలా తప్పించుకుని దైవ భక్తుడుగా మారి భగవంతుడుని చేరుకుని చరిత్రలో చోటు సంపాదించుకున్నాడనేది మిగాతా కథ.