పేపర్ బాయ్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోపె, నాగినీడు, సుహాస్, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయశంకర్ ఆర్ వహించారు మరియు నిర్మాత సంపత్ నందిని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ అందించారు.
కథ
బీటెక్ చదివిన రవి (సంతోష్ శోభన్) పేదరికం కారణంగా పేపర్‌బాయ్‌గా పనిచేస్తుంటాడు. తండ్రి ఆటో, తల్లి పలు ఇండ్లలో వంటమనిషిగా పనిచేస్తుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన యువతి ధరణి (రియా సుమన్)తో రవి ప్రేమలో పడుతాడు. ఇరు వైపుల కుటుంబాల వీరి ప్రేమకు ఒకే చెప్పినప్పటికీ.. ఓ కారణంగా విడిపోతారు. రవి చనిపోయాడనే విషయంతో ధరణి తీవ్రమైన నిర్ణయం తీసుకొంటుంది. ధరణి, రవి కోసం కొన్ని రోజుల్లో చనిపోబోతున్న మేఘా (తన్యా హోప్) వెతుకొంటూ వస్తుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకొన్నప్పటికీ ధరణి, రవి ప్రేమ ఎందుకు పెళ్లి వరకు చేరలేకపోయింది? ధరణి ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొన్నది? రవి నిజంగానే చనిపోయాడా? తనకు రవి దూరం కావడంతో ధరణి పరిస్థితి ఏంటి? ఈ కథలో మేఘా (తన్యా హోప్) పర్పస్ ఏమిటి? ధరణి వారిని ఎందుకు వెతుక్కొంటూ వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే పేపర్‌బాయ్ చిత్ర కథ.