పవిత్ర సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీయ, శివాజీ, సాయికుమార్, కౌశిక్ బాబు, ఏవిఎస్, బ్రహ్మానందం, యండమూరి, అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, కొడవలస, రోజా, తెలంగాణ శకుంతల,తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శత్వం : జనార్ధన మహర్షి నిర్వహించారు మరియు నిర్మాతలు : గురజాల మహేశ్వర రెడ్డి, కరమశెట్టి సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చరు.
కథ
పవిత్ర(శ్రీయ) క్యాన్సర్ భారిన పడిన తన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు సంపాదన మార్గంగా వేశ్య వృత్తిలోకి దిగుతుంది. ఖరీదైన వేశ్య అయిన ఆమె వద్దకు అవినీతి ఎమ్మేల్యే సుదర్శన్(సాయికుమార్), ఫేక్ బాబా సర్వ రోగా నిరోధానంద స్వామి(రవిబాబు) లాంటి వారు కూడా వస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును మున్నా(కౌషిక్ బాబు)ను పోటీలో నిలబెట్టాలని చూస్తాడు సుదర్శన్. మున్నా భయస్తుడు కావడంతో అనిలో మార్పు తేవడానికి కొడుకును పవిత్ర దగ్గరికి పంపిస్తాడు.
దీంతో మున్నా పవిత్రను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని తండ్రితో చెప్పడంతో...రాజకీయంగా ప్లస్సవుతుందని వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత కథ మలుపు తిరిగి పవిత్ర రాజకీయాల్లోకి వస్తుంది. మోడల్స్ గా మారుస్తానని అమ్మాయిలను మోసం చేస్తున్న శివ(శివాజీ)ని పవిత్ర పథకం ప్రకారం జైలుకు పంపడంతో శివ పవిత్రపై కక్షకట్టి చంపడానికి ప్లాన్ చేస్తాడు. పవిత్ర రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి? వచ్చి ఏం చేసింది? శివ ఏం చేసాడు అనేది తర్వాతి కథ.