పేట సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్, సిమ్రన్ బగ్గా, త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి, సనంత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తిక్ సుబ్బారాజ్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత అశోక్ వల్లభనేని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందింస్తున్నారు.
కథ
ప్రధానమంత్రి పీఏ సిఫారసుతో కాళి (రజనీకాంత్) ఓ కాలేజీలో హాస్టల్ వార్డెన్‌గా చేరుతాడు. ప్రేమజంట అయిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయి (సనత్, మేఘా ఆకాశ్)పై జరిగే దాడులను అడ్డుకోవడానికి ఆ కాలేజీకి వస్తాడు. ర్యాగింగ్, ఇతర గ్రూపు గొడవలకు ఫుల్‌స్టాప్ పెడుతాడు. అమ్మాయి తండ్రి చేసే దాడులను ఎదురించే క్రమంలో అతని పేరు కాళి కాదు.. పేట వీర అని తెలుస్తుంది. సింహాచలం సింగ్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)తో విభేదాలు బయటకు వస్తాయి.
కాళి పేరుతో హాస్టల్‌లో చేరిన పేట వీర గతమేమిటి? ఎందుకోసం కాళిగా మారాడు. యువ జంటను రక్షించే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ కథలో జిత్తు (విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి? సింహాచలం సింగ్, పేట మధ్య గొడవలు ఎందుకు చోటుచేసుకొన్నాయి? చివరకు జిత్తు, సింహాచలంపై ఎలా పగతీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే పేట సినిమా కథ.