పోరా పోవే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కరణ్, సౌమ్య సుకుమార్, అరవింద్, శ్రీనివాస్, చంటి ఎఫ్.ఎమ్ బాబాయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లంకపల్లి శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు యెల్కిచర్ల వీరేందర్ రెడ్డి, శ్రీనివాస్ బింగమళ్ళ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యజమాన్య స్వరాలు సమకుర్చరు.
కథ
ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేవరకూ కో ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియని... వికాస్ (కరణ్), శ్రీచైతన్య (సౌమ్య సుకుమార్) కథ ఇది. వీరిద్దరూ రవీంద్రనాధ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరే వరకూ అప్పటివరకూ ప్రేమ వంటి వ్యవహారాలు ఉండవు. దాంతో ఒక్కసారిగా స్వేచ్చ వచ్చినట్లు ఫీలైన వీరిద్దరూ షరా మామూలుగా ప్రేమ(లేదా ఆకర్షణ) లో పడిపోతారు. అక్కడ నుంచి ఆ జంటకు ఆమె స్నేహితురాళ్ల నుంచి, ఆమె సోదరుడు నుంచి, బావ నుంచి సమస్యలు ఎదురయ్యి..బ్రేక్ అప్ లు అవుతాయి. వీటిని ఎలా అథిగమించి...ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.