పోటుగాడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మనోజ్, సిమ్రాన్ కౌర్, సాక్షి చౌదరి, రేచల్, అనుప్రియ, సోసాని కృష్ణ మురళి, అలీ, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : పవన్ ఒడయార్ నిర్వహించారు మరియు నిర్మాతలు: లగడపాటి శ్రీధర్, శిరీష కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు.
కథ
ప్రేమలో విఫలమైన గోవిందు(మంచు మనోజ్) ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ చోటుకు వెళతాడు. అదే చోటుకి వెంకట రత్నం(పోసాని కృష్ణ మురళి) కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. చచ్చేముందు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. గోవిందు తన నాలుగు ప్రేమకథల గరించి మొదలు పెట్టడంతో ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
తొలుత గొవిందు వైదేహి అనే బ్రహ్మాణ అమ్మాయితో ప్రేమలో పడతాడు. వైదేహి(సిమ్రాన్ కౌర్) తండ్రి అడ్డుచెప్పడంతో ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత ముంతాజ్(సాక్షి చౌదరి)తో ప్రేమలో పడతాడు కానీ వర్కౌట్ కాదు. మూడోసారి ఫారిన్ లేడీ స్టేసీ(రేచల్)తో ప్రేమలో పడతాడు....ఈ ప్రేమ కూడా ఫెయిల్ అవుతుంది. నాలుగోసారి మేరీ(అనుప్రియ)తో లవ్ ఎఫైర్ మొదలెడతాడు. మేరీతో జీవితంలో నిమైన ప్రేమ అనుభూతిని పొందుతాడు. కానీ ఈ ప్రేమ కూడా ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. గోవిందు ప్రేమలో ఎందుకు విఫలం అయ్యాడు? ముగింపు ఏమిటనేది థియేటర్లో చూడాల్సిందే.