పవర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులోరవితేజ, హన్సిక మొత్వని, రెజీనా, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, సుబ్బరాజు తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు.ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె ఎస్ రవీంద్రనాథ్ (బాబి) నిర్వహించారు. నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కలకత్తాలో బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ అవినీతి పోలీసు అధికారి. అతను గంగూలీ భాయ్ (సంపత్ రాజ్) అనే గ్యాంగస్టర్ ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో సేవ్ చేసి, అండర్ గ్రౌండ్ కు తీసుకువెళ్లాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తన ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే హైదరాబాద్ లో ...తిరుపతి(రవితేజ) పోలీస్ ఉద్యోగం కావాలని, అదే జీవితాశయంగా తిరుగుతున్న కుర్రాడు. అతన్ని విలన్(ముకేష్ రుషి) ఓ రోజు టీవిలో చూస్తాడు. దాంతో అతన్ని తీసుకువచ్చి చనిపోయిన బలదేవ్ సహాయ్ ప్లేస్ లో ప్రవేశపెట్టి తన పనులు జరుపుకోవాలనుకుంటాడు. అప్పుడు అసలైన ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి...విలన్స్ కు హీరో ఎలా బుద్ది చెప్పాడు...బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.