ప్రతినిధి సినిమా డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ మండవ నిర్వహించారు మరియు నిర్మాత జె.సాంబశివరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు. మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిం