రాధా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, లావణ్య త్రిపాటి, రవి కిషన్, అవినాష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర మోహన్ వహించారు మరియు నిర్మాత బి వి ఎస్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తిక్ ఘంటమనేని స్వరాలు అందించారు.
కథ
రాధాకృష్ణ అలియాస్ రాధ (శర్వానంద్) కు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఒక సందర్భంలో క్రిమినల్స్ పట్టుకోవడాన్ని డీజీపీ చూసి ఏకంగా రాధకు ఎస్ఐ ఉద్యోగం ఇస్తాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న తర్వాత వరంగల్ జిల్లాలో పోస్టింగ్ ఇస్తాడు. ఇక ఊరి పరిస్థితి ఏంటంటే అసలే కేసులు ఉండవు. పనిపాటా లేని రాధాకృష్ణ ఆ ఊర్లో రాధ (లావణ్య)ను తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం వెంటపడి ప్రసన్నం చేసుకొంటాడు. ఈ క్రమంలో రాధాకృష్ణకు హైదరాబాద్‌లోని దూల్‌పేటకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలు చాలా రంజుగా ఉంటాయి. సీఎం (కోటా శ్రీనివాసరావు) పదవి నుంచి రిటైర్మ్‌మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. తదుపరి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని నిర్ణయించే బాధ్యత కోటకు అప్పగిస్తారు. సీఎం పదవికి ఎమ్మెల్యే సుజాత (రవికిషన్), మరో సినియర్ నేత అయిన (ఆశీష్ విద్యార్థి) మధ్య పోటీ ఉంటుంది. సీఎం పదవి ఎలాగైనా దక్కించకోవాలన్న ఆశతో సుజాత తనపైనే బ్లాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకొంటాడు. ఆ బ్లాస్టింగ్‌లో పోలీసులు రెహ్మాన్ (బ్రహ్మాజీ), అర్జున్ (షకలక శంకర్) ప్రాణాలు కోల్పోతారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పోలీసులపై ఓ ఆరోపణ మోపుతారు. దాంతో ఆగ్రహించిన రాధా.. సుజాతపై కక్ష తీసుకోవాలని నిర్ణయించుకొంటాడు. మంత్రి సుజాతపై రాధ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. అందుకు రాధ చేసిన ప్లాన్లేంటి? తన ప్రేయసి రాధను ఎలా పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లాడు అనే ప్రశ్నలకు సమాధానమే రాధ సినిమా.