X
రాధా

రాధా

Action | Romance | 12 May 2017 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రాధా స్టోరీ

రాధా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, లావణ్య త్రిపాటి, రవి కిషన్, అవినాష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర మోహన్ వహించారు మరియు నిర్మాత బి వి ఎస్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తిక్ ఘంటమనేని స్వరాలు అందించారు. కథ రాధాకృష్ణ అలియాస్ రాధ (శర్వానంద్) కు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఒక సందర్భంలో క్రిమినల్స్ పట్టుకోవడాన్ని డీజీపీ చూసి ఏకంగా రాధకు ఎస్ఐ ఉద్యోగం ఇస్తాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న తర్వాత వరంగల్ జిల్లాలో పోస్టింగ్ ఇస్తాడు. ఇక ఊరి పరిస్థితి ఏంటంటే అసలే కేసులు ఉండవు. పనిపాటా లేని రాధాకృష్ణ ఆ ఊర్లో రాధ (లావణ్య)ను తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం వెంటపడి ప్రసన్నం చేసుకొంటాడు. ఈ క్రమంలో రాధాకృష్ణకు హైదరాబాద్‌లోని దూల్‌పేటకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రాష్ట్ర రాజకీయాలు చాలా రంజుగా ఉంటాయి. సీఎం (కోటా శ్రీనివాసరావు) పదవి నుంచి రిటైర్మ్‌మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. తదుపరి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని నిర్ణయించే బాధ్యత కోటకు అప్పగిస్తారు. సీఎం పదవికి ఎమ్మెల్యే సుజాత (రవికిషన్), మరో సినియర్ నేత అయిన (ఆశీష్ విద్యార్థి) మధ్య పోటీ ఉంటుంది. సీఎం పదవి ఎలాగైనా దక్కించకోవాలన్న ఆశతో సుజాత తనపైనే బ్లాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకొంటాడు. ఆ బ్లాస్టింగ్‌లో పోలీసులు రెహ్మాన్ (బ్రహ్మాజీ), అర్జున్ (షకలక శంకర్) ప్రాణాలు కోల్పోతారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పోలీసులపై ఓ ఆరోపణ మోపుతారు. దాంతో ఆగ్రహించిన రాధా.. సుజాతపై కక్ష తీసుకోవాలని నిర్ణయించుకొంటాడు. మంత్రి సుజాతపై రాధ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. అందుకు రాధ చేసిన ప్లాన్లేంటి? తన ప్రేయసి రాధను ఎలా పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లాడు అనే ప్రశ్నలకు సమాధానమే రాధ సినిమా.
Read More

రాధా కాస్ట్ & క్రూ

రాధా సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్ర మోహన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాధా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చంద్రమోహన్.. గుర్తింపుకు నోచుకొని పోలీసు శాఖ సేవలను కథాంశంగా ఎంచుకోవడం మంచి పనే. కానీ అందుకు తగిన కసరత్తు చేయడంలో విఫలమయ్యారనే విషయం సినిమా ప్రారంభించిన పావుగంటకే అర్థమవుతుంది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్, ఇతర పాత్రల తీరుతెన్నులు చాలా పేలవంగా ఉంటాయి. కథలో అటు సీరియస్ నెస్ ఉండదు. అలాగా అని కామెడీ ఉండదు. ఈ రెండు అంశాల మధ్య సినిమా నలిగిపోయిందనే చెప్పవచ్చు. శర్వానంద్, లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమకథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పండకపోవడం మరో మైనస్. రవికిషన్ పాత్ర బాగా ఉన్న ఆయన చుట్టు ఉండే ఎన్విరాన్‌మెంట్ చాలా పేలవంగా ఉండటంతో మరింత నాసిరకంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో మంత్రి సుజాతను ఎదుర్కొనేందుకు శర్వానంద్ రాధ ప్లాన్లు అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల సినిమా ఎదో సాదాసీదాగా నడుస్తున్నదనే భావన కలుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎదైనా ఆసక్తిగా ఉంటుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. శతమానం భవతి లాంటి సినిమా తర్వాత శర్వానంద్‌ రాధ లాంటి సినిమా చేయడం సరికాదనే ఫీలింగ్ కలుగడం ఖాయం. ఇక సంగీతం, పాటలు ఆడియోలో అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కనీసం తెరమీదనైనా ఆసక్తిగా ఉన్నాయా అంటే అదీ కనిపించదు. వెరసి రాధ చిత్రం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని అతి సాధారణ సినిమాగా కనిపిస్తుంది.

రాధా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రాధా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+