రాజా రాణి సినిమా తెలుగు డబ్బింగ్ చిత్రం ఇందులో ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్, సత్యరాజ్, సంతానం, మనోబాల, సత్యన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఆర్ మురుగదాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జీవి ప్రకాశ్ స్వరాలు సమకుర్చరు.
కథ
కొత్తగా పెళ్లైన జేమ్స్(ఆర్య),రెజీనా(నయనతార) కి ఒక్క క్షణం కూడా పడదు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దవి చేసి అంటీ ముట్టనట్లు మసులుతూంటారు. ఈ క్రమంలో ఓ రోజు జేమ్స్ తాగి ఇంటికి వచ్చినప్పుడు రెజీనా ఫిట్స్ తో బాధపడుతూ కనపడితుంది. దాంతో ఆమెను వెంటనే హాస్పటిల్ లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ ఆమె మెడికల్ హిస్టరీ గురించి అడిగినప్పుడు ...ఆమె గురించి తనకేమీ తెలియదనే విషయం అర్దం చేసుకుంటాడు. దాంతో ఆమెతో తొలిసారి మనస్సు విప్పి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆమె గతం లో ఉన్న ఫెయిల్యూర్ ప్రేమ కథ తెలుసుకుంటాడు. ఆమె తనతో ఎందుకు అంటీ ముట్టనట్లు ఉంటోందో అర్దం చేసుకుంటాడు. చలించిన జేమ్స్ కూడా తన విఫల ప్రేమ కథను ఆమెకు చెప్పి ఓదారుస్తాడు. ఇలా ఇద్దరూ తమకు వేరు వేరు ఫెయిల్యూర్ ప్రేమ కథలు ఉన్నాయని తెలుసుకున్నాక వీరిద్దరి జీవితంలో ఏం మార్పు వచ్చింది. వారి కాపురం చక్కబడిందా అనేది మిగతా కథ.