X
తెలుగు » సినిమాలు » రాజా రాణి
రాజా రాణి

రాజా రాణి

Comedy | Romance | 14 Mar 2014 | U |
Telugu

2.9 /5 Users

2.5 /5 Filmibeat

రాజా రాణి స్టోరీ

రాజా రాణి  సినిమా తెలుగు డబ్బింగ్ చిత్రం ఇందులో ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్ , సత్యరాజ్, సంతానం, మనోబాల, సత్యన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఆర్ మురుగదాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జీవి ప్రకాశ్ స్వరాలు సమకుర్చరు. కథ కొత్తగా పెళ్లైన జేమ్స్(ఆర్య),రెజీనా(నయనతార) కి ఒక్క క్షణం కూడా పడదు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దవి చేసి అంటీ ముట్టనట్లు మసులుతూంటారు. ఈ క్రమంలో ఓ రోజు జేమ్స్ తాగి ఇంటికి వచ్చినప్పుడు రెజీనా ఫిట్స్ తో బాధపడుతూ కనపడితుంది. దాంతో ఆమెను వెంటనే హాస్పటిల్ లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ ఆమె మెడికల్ హిస్టరీ గురించి అడిగినప్పుడు ...ఆమె గురించి తనకేమీ తెలియదనే విషయం అర్దం చేసుకుంటాడు. దాంతో ఆమెతో తొలిసారి మనస్సు విప్పి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆమె గతం లో ఉన్న ఫెయిల్యూర్ ప్రేమ కథ తెలుసుకుంటాడు. ఆమె తనతో ఎందుకు అంటీ ముట్టనట్లు ఉంటోందో అర్దం చేసుకుంటాడు. చలించిన జేమ్స్ కూడా తన విఫల ప్రేమ కథను ఆమెకు చెప్పి ఓదారుస్తాడు. ఇలా ఇద్దరూ తమకు వేరు వేరు ఫెయిల్యూర్ ప్రేమ కథలు ఉన్నాయని తెలుసుకున్నాక వీరిద్దరి జీవితంలో ఏం మార్పు వచ్చింది. వారి కాపురం చక్కబడిందా అనేది మిగతా కథ.
Read More

రాజా రాణి కాస్ట్ & క్రూ

రాజా రాణి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అట్లీ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత ఎ ఆర్ మురుగదాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రాజా రాణి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఊహకు అందే కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం తయారుచేసుకోవటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తితో తెరకెక్కించాడు. అన్యోన్యత కోల్పొయిన భార్య భర్తల మధ్య సాగే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. రొటీన్ గావస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం ఉంది. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టుబుల్ గా నడిచింది. సినిమా ప్రారంభమైన పది నిముషాలకే క్లైమాక్స్ ఊహించేటట్లు ఉంది. అయితే సీన్స్ తో ఆ లోటు తెలియనీయకుండా చేసాడు. ఫైనల్ గా ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోకపోయినా మల్టిప్లెక్స్ ,ఎ సెంటర్లలను వారికి నచ్చే అవకాసం ఉంది. ఎక్కడా అసభ్యత,హింస లేని ఈ చిత్రం ఫ్యామిలీస్ కు కూడా మంచి ఆప్షనే.

రాజా రాణి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

రాజా రాణి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+