రామ్ అసుర్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాన్వీ సాల్మాన్, షెర్రీ అగర్వాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకటేష్ త్రిపర్ణ వహించారు. నిర్మాతలు: అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ నిర్మించారు. సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించారు.
కథ
పుష్కలంగా ప్రతిభ ఉన్న యువకుడు రామ్ (రామ్ కార్తీక్) తన ప్రయోగశాలలో రసాయన ప్రక్రియ ద్వారా కృత్రిమంగా వజ్రం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ (షెర్రీ అగర్వాల్)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు రామ్‌కు ప్రియ బ్రేకప్ చెబుతుంది. జీవితంలో ఎంతో సక్సెస్ చూసిన రామ్‌కు రకరకాల వైఫల్యాలను చూస్తుండటంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. అయితే నర్సీపట్నంలోని సూరి (అభినవ్ సర్దార్)ను కలువమని సలహా ఇస్తాడు. కృత్రి వజ్రం తయారు చేయడంలో ఏ మేరకు రామ్ సఫలమయ్యాడు? రామ్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెప్పింది? సూరిని కలవమని రామ్‌కు ఎందుకు రామాచారి సలహా ఎందుకు ఇచ్చాడు? సూరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? సూరి గతం ఏమిటి? సూరికి ప్రియురాలు చాందినీ (చాందిని తమిళారాసన్) ఎందుకు దూరమైంది? సూరి ఎందుకు అసురుడిగా మారారు? రామ్‌కి అసురుడిగా మారిన సూరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనే ప్రశ్నలకు సమాధానమే రామ్ అసుర్ సినిమా కథ.