X
తెలుగు » సినిమాలు » రామ్ సేతు
రామ్ సేతు

రామ్ సేతు

Action | Adventure | Thriller | 25 Oct 2022 | U/A | 142 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రామ్ సేతు స్టోరీ

రామ్ సేతు మూవీ యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, నుష్రత్ భరుచ్చా, నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభిషేక్ శర్మ వహించారు. నిర్మతలు అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్ కలిసి నిర్మించారు. సంగీతం డేనియల్ బి జార్జ్ నిర్మించారు.  కథ డాక్టర్ ఆర్యన్ కులశ్రేష్ట (అక్షయ్ కుమార్) ప్రపంచంలోనే ప్రముఖ ఆర్కియాలజిస్ట్. అఫ్ఘనిస్థాన్‌లో పురాతన కట్టడాల పరిరక్షణకు సంబంధించిన మిషన్‌లో అనేక కొత్త విషయాలను తెలుసుకొని పాకిస్థాన్ ప్రశంసలు పొందడమే కాకుండా ఇండియాలోని ఆర్కియాలజి ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ అవుతాడు. అయితే శ్రీలంక, భారత్‌ను కలిపే ప్రాచీన రామసేతు కట్టడం మానవ నిర్మాణమే అంటూ రిపోర్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో రామసేతును కూల్చి సేతు సముద్రాన్ని నిర్మించాలని పారిశ్రామికవేత్త ఇంద్రజిత్ (నాజర్) ప్రయత్నిస్తుంటాడు. రామ సేతు మానవ కట్టడమే.. రాముడు నిర్మించలేదని రిపోర్టు ఇచ్చిన తర్వాత ఆర్యన్ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? ఆర్యన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత భార్య, ప్రొఫెసర్ గాయత్రి (నుస్రత్ బారుచా) తన భర్తను విడిచి వెళ్లింది? రామసేతు కట్టడం వెనుక వాస్తవాలు తెలుసుకొనేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఏపీ (సత్యదేవ్) పాత్ర ఏమిటి? రామ సేతు రహదారి నిర్మాణంపై పరిశోధనలో డాక్టర్ సండ్రా రెబెల్లో (జాక్వలైన్ ఫెర్నాండేజ్) ఆర్యనకు ఎలాంటి సహకారం అందించింది? రామ సేతు కట్టడం మానవ నిర్మాణమా? లేదా రాముడు నిర్మించిన కట్టడమేనా? అనే ప్రశ్నలకు సమాధానమే రామ్ సేతు చిత్ర కథ. 
Read More

రామ్ సేతు కాస్ట్ & క్రూ

రామ్ సేతు సిబ్బంది సమాచారం

దర్శకత్వం అభిషేక్ శర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం డేనియల్ బి జార్జ్
నిర్మాత అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రామ్ సేతు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రామ సేతు వివాదం వెనుక ఉన్న అపోహాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు తీసిన చిత్రం రామ సేతు. అయితే శ్రీరాముడు హిందువులకు ఓ భావోద్వేగం. అలాంటి భావోద్వేగాన్ని తెర మీద పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథ, కథనాలు పేలవంగా ఉన్నాయి. సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రమే. హిందూ చరిత్ర ఆధారంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. కావాల్సినంత సమయం, ఏం పని లేదనుకొంటే.. ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చు. లేదంటే.. ఓటీటీలో వచ్చే వరకు వేచి ఉండటమే.

రామ్ సేతు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రామ్ సేతు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+