For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Setu movie review.. పండని శ్రీరాముడి భావోద్వేగం..పేలవంగా కథ, కథనాలు

  |

  Rating:
  2.0/5
  Star Cast: Akshay Kumar, Satya Dev, Jaqualine Fernodez
  Director: Abhishek Sharma

  నటీనటులు: అక్షయ్ కుమార్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నుస్రత్ బారుహా, సత్యదేవ్, నాజర్ తదితరులు
  దర్శకత్వం: అభిషేక్ శర్మ
  నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ భాటియా తదితరులు
  సినిమాటోగ్రఫి: అసీమ్ మిశ్రా
  ఎడిటింగ్: రామేశ్వర్ ఎస్ భగత్
  మ్యూజిక్: డేనియల్ బీ జార్జ్
  బ్యానర్స్: అమెజాన్ స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, లైకా ప్రోడక్షన్స్, అబండన్షియా ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2022-10-25

  రామ సేతు కథ ఏమిటంటే?

  రామ సేతు కథ ఏమిటంటే?

  డాక్టర్ ఆర్యన్ కులశ్రేష్ట (అక్షయ్ కుమార్) ప్రపంచంలోనే ప్రముఖ ఆర్కియాలజిస్ట్. అఫ్ఘనిస్థాన్‌లో పురాతన కట్టడాల పరిరక్షణకు సంబంధించిన మిషన్‌లో అనేక కొత్త విషయాలను తెలుసుకొని పాకిస్థాన్ ప్రశంసలు పొందడమే కాకుండా ఇండియాలోని ఆర్కియాలజి ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ అవుతాడు. అయితే శ్రీలంక, భారత్‌ను కలిపే ప్రాచీన రామసేతు కట్టడం మానవ నిర్మాణమే అంటూ రిపోర్ట్ ఇస్తాడు. ఈ క్రమంలో రామసేతును కూల్చి సేతు సముద్రాన్ని నిర్మించాలని పారిశ్రామికవేత్త ఇంద్రజిత్ (నాజర్) ప్రయత్నిస్తుంటాడు.

  రామ సేతులో ట్విస్టులు

  రామ సేతులో ట్విస్టులు


  రామ సేతు మానవ కట్టడమే.. రాముడు నిర్మించలేదని రిపోర్టు ఇచ్చిన తర్వాత ఆర్యన్ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? ఆర్యన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత భార్య, ప్రొఫెసర్ గాయత్రి (నుస్రత్ బారుచా) తన భర్తను విడిచి వెళ్లింది? రామసేతు కట్టడం వెనుక వాస్తవాలు తెలుసుకొనేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఏపీ (సత్యదేవ్) పాత్ర ఏమిటి? రామ సేతు రహదారి నిర్మాణంపై పరిశోధనలో డాక్టర్ సండ్రా రెబెల్లో (జాక్వలైన్ ఫెర్నాండేజ్) ఆర్యనకు ఎలాంటి సహకారం అందించింది? రామ సేతు కట్టడం మానవ నిర్మాణమా? లేదా రాముడు నిర్మించిన కట్టడమేనా? అనే ప్రశ్నలకు సమాధానమే రామ్ సేతు చిత్ర కథ.

  ఫస్టాఫ్‌ మరీ రొటీన్‌గా

  ఫస్టాఫ్‌ మరీ రొటీన్‌గా


  అఫ్ఘనిస్థాన్‌లో హిందూ కట్టడాలు, విగ్రహాలపై తాలిబాన్ల దుశ్చర్య, దురాగతాలతో రామ సేతు సినిమా ఆసక్తికరంగానే మొదలైనట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత తాలిబాన్లకు, అక్షయ్ కుమార్ టీమ్‌కు జరిగే యాక్షన్ సీన్లు పరమ రొట్టగా తీశారనిపిస్తుంది. అక్కడి నుంచి రామ సేతు ప్రాజెక్టు వైపు కథ ప్రయాణించడం.. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు చాలా బోర్‌గా ఉంటాయి. చాలా పేలవంగా, రొటీన్‌గా ప్రథమార్థాన్ని ముగించే ప్రయత్నం చేశారు.

   క్లైమాక్స్‌తో కాస్త ఊరట

  క్లైమాక్స్‌తో కాస్త ఊరట


  ఇక సెకండాఫ్‌లోనైనా కథ ఎమోషనల్‌గా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే అవుతుంది. ఏపీ (సత్య దేవ్) పాత్ర అటు సీరియస్‌గా లేకుండా.. ఇటు హ్యుమర్‌కు కొరకాకుండా మధ్యలో ఊగిసలాడుతుంది. కాకపోతే బాలీవుడ్ చిత్రంలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రలో కనిపించాడు. కొన్నిసార్లు అక్షయ్ కుమార్‌ను కూడా డామినేట్ చేశారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీలంకలో త్రికూట పర్వతం, సంజీవనీ మూలిక, రామ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాయి చుట్టు కథ తిరిగి నీరసంగా సుప్రీకోర్టుకు చేరుతుంది. అయితే సుప్రీంకోర్టులో జరిగే ఎపిసోడ్ సినిమాను రక్షించిందా అనిపిస్తుంది.

  దర్శకుడు అభిషేక్ తడబాటు

  దర్శకుడు అభిషేక్ తడబాటు


  కొద్ది సంవత్సరాలుగా తమిళనాడులో కేంద్రీకృతమైన రామ సేతు నిర్మాణ వివాద నేపథ్యంగా తనదైన క్లారిటీ ఇచ్చేందుకు దర్శకుడు అభిషేక్ శర్మ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ ఒక భావోద్వేగమైన కథ, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా సినిమాను రూపొందించలేకపోవడం ఈ సినిమా పెద్ద మైనస్. అఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఎపిసోడ్స్ చాలా పేలవంగా ఉంటాయి. మంచి అడ్వెంచర్‌కు స్కోప్ ఉన్న సినిమాను చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా తెరకెక్కించారు. అయితే చివరి 20 నిమిషాల్లో కోర్టు డ్రామాను సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా చిత్రీకరించడం కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.

  అక్షయ్ కుమార్, ఇతర పాత్రల గురించి

  అక్షయ్ కుమార్, ఇతర పాత్రల గురించి


  ఆర్కియాలజిస్ట్ ఆర్యన్‌గా అక్షయ్ కుమార్ విభిన్నమైన గెటప్‌తో కనిపించాడు. ఎప్పటి మాదిరిగానే యాక్షన్ సీన్లలో ఫ్యాన్స్‌ను మెప్పించాడు. క్లైమాక్స్‌లోని కోర్డు డ్రామాలో అక్షయ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. నుస్రత్ బరుచా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ పాత్రలు అతిథి, సపోర్టింగ్ పాత్రల మాదిరిగానే ఉంటాయి. ఇక ఈ సినిమాలో అంజనీపుత్రుడు (ఏపీ)గా సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో దాదాపు అక్షయ్‌ను డామినేట్ చేశాడనేంతగా నటించాడు. గాడ్‌ఫాదర్ తర్వాత మరో మంచి పాత్రలో కనిపించాడు. నాజర్, ఇతర పాత్రలు ఒకేలా ఉంటాయి.

  రామ సేతులో టెక్నికల్‌గా

  రామ సేతులో టెక్నికల్‌గా


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. శ్రీలంక, గోవా, డయ్యు డామన్, తదితర ప్రాంతాల్లో చిత్రీకిరించిన సన్నివేశాలు కన్నులకు పండుగగా ఉంటాయి. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కథ, కథనాలు పేలవంగా ఉంటే.. సాంకేతిక విభాగాలు కూడా మరుగున పడిపోతాయనే విషయాన్ని రామ సేతు నిరూపించింది. నిర్మాణ విలువలు ఒకేలా ఉన్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  పాజిటివ్ పాయింట్స్
  1. అక్షయ్ కుమార్, సత్య దేవ్
  2. సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  1. కథ, కథనాలు
  2. సాంకేతిక విభాగాల పనితీరు
  3. డాక్యుమెంటరీ మాదిరిగా..

  రామ సేతు ఫైనల్‌గా ఎలా ఉందంటే

  రామ సేతు ఫైనల్‌గా ఎలా ఉందంటే


  రామ సేతు వివాదం వెనుక ఉన్న అపోహాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు తీసిన చిత్రం రామ సేతు. అయితే శ్రీరాముడు హిందువులకు ఓ భావోద్వేగం. అలాంటి భావోద్వేగాన్ని తెర మీద పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథ, కథనాలు పేలవంగా ఉన్నాయి. సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రమే. హిందూ చరిత్ర ఆధారంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. కావాల్సినంత సమయం, ఏం పని లేదనుకొంటే.. ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చు. లేదంటే.. ఓటీటీలో వచ్చే వరకు వేచి ఉండటమే.

  English summary
  Bollywood Super Star Akshay Kumar's Ram Setu movie hits the Theatres on October 25th, 2022. Here is the Telugu filmibeat Exclusive Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X