క్రాక్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శ్రుతీ హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మాలినేని వహించారు మరియు నిర్మాత మధు బి నిర్మించారు. సంగీతం తమన్ అందించారు.
కథ
హీరోయిజాన్ని పండించాలంటే హీరో చేత ఖాకీ చొక్కాను తొడిగించాల్సిందే. అలాంటి హీరోయిజం ఉండి.. తలతిక్కలోడు క్రాక్ లాంటి వాడు పోతరాజు వీర శంకర్ (రవితేజ). ఎదుటి వాడి నుంచి బ్యాక్ గ్రౌండ్ అనే మాట వినిపిస్తే వీర శంకర్‌కు ఎక్కడో కాలిపోద్ది. అవతల ఉన్న వాడి అంతు చూసే వరకు వదలడు. అన్యాయాలను సహించని వీరశంకర్.. ముగ్గురి జీవితాల్లోకి వెళ్తాడు. టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిల కథలను ముగిస్తాడు. మామిడిపండు, మేకు, యాభై రూపాయల నోటు అంటూ ట్రైలర్‌లో ఆసక్తి పెంచారు. ఆ మూడింటికి టెర్రరిస్ట్ సలీమ్, కటారి కృష్ణ, కడప రెడ్డిలకు ఉన్న సంబంధం ఏంటి? వీరశంకర్ చివరకు ఆ ముగ్గురిని ఏం చేశాడు? అసలు ఇందులో కటారి కృష్ణ పాత్ర ఏంటి? ఈ ఇద్దరి మధ్య వైరం ఎలా మొదలైంది? జయమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) కథ ఏంటి? కళ్యాణి (శ్రుతీ హాసన్) విషయం ఏంటి? వంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానమే క్రాక్.