RDX లవ్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్, నరేష్, ఆదిత్యమీనన్, నాగినీడు, తులసి, అమని, విద్యుల్లేఖ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ భాను వహించారు, రామ్ మునీష్ సమర్పణలో సి. కల్యాణ్ నిర్మించారు. సి.వి రావు సహ నిర్మాత. ఈ సినిమాకు రధన్ సంగీతం అందించారు. కెమెరా : C.రామ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, కో-ప్రొడ్యూసర్ : సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిన్నా.
కథ
అలివేలు (పాయల్ రాజ్‌పుత్) ప్రభుత్వ పథకాలను పేదవర్గాలకు చేరవేసే సామాజిక కార్యకర్త. అలివేలును చూసి మీడియా అధినేత గిరి ప్రకాశ్ (ఆదిత్య మీనన్) కుమారుడు సిద్దు తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో వారి పరిచయం ప్రేమగా మారుతుంది. తన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ సిద్దూతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంటుంది. అలివేలు, సిద్ధూ ప్రేమ విషయం తెలుసుకోవాలని వారిని విడదీయాలని ప్లాన్ వేస్తాడు. అలివేలుతో ప్రేమను విడగొట్టడంలో సిద్ధూ తండ్రి సఫలమయ్యాడా? తండ్రి చేసిన పనిని సిద్ధు ఎదురించాడా? సీఎంను అలివేలు ఎందుకు కలువాలనుకొంటుంది? ఈ కథలో మోనా డేవిడ్ (ముమైత్ ఖాన్) పాత్ర ఏమిటి? చివరకు అలివేలు, సిద్ధూ ప్రేమ ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే RDX లవ్ సినిమా కథ.