రెచ్చిపో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, ఇలియానా, ఆహుతీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, సునీల్, రమాప్రభ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి నిర్వహించారు మరియు నిర్మాత జివి రమణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికి వస్తే శివ(నితిన్) ఓ అనాధ, అంతే కాకుండా ఓ మంచి దొంగ. మంచి దొంగ అంటే సినిమాలు బాగా చూసే వారికి ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది. ధనవంతుల దగ్గర డబ్బు దొంగలించి పేదలకు పంచుతుంటాడు. అలాంటి దొంగను పట్టుకోమని హూమ్ మినిస్టర్(ఆహుతీ ప్రసాద్) చెప్పేవరకూ పట్టించుకోని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భానుచందర్. శివ గురించి బాగా తెలిసిన భానుచందర్ హూమ్ మినిస్టర్ ఇంట్లో వుండే 500 కోట్ల రూపాయల గురించి హింట్ ఇచ్చి, దాన్ని దోచుకోమని శివతో చెప్తాడు. దీంతో శివ రెచ్చిపోయి, చిన్న పిల్లల్ని బురిడీ కొట్టించినట్టు పోలీసులని మోసగించి ఆ డబ్బును దోచుకుంటాడు. అసలు విషయం ఏంటంటే ఆ డబ్బు దుబాయ్ లో వుంటూ ఇండియాలో క్రికెట్ బెట్టింగులు లాంటి మోసపూరిత పనులు చేస్తుండే గ్యాంగ్ స్టర్ సుకోర్ కు చెందింది.