రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష విశ్వనాథ్, వినోద్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎం రమేష్, గోపి కలిసి వహించారు. నిర్మాత కె శిరీషా రెడ్డి నిర్మించారు. సంగీతం మహిత్ నారాయణ్ అందించారు.
కథ
కులాంతర, ప్రేమ వివాహాలకు బద్ద వ్యతిరేకి ప్రతాప్ రెడ్డి (వినోద్ కుమార్). ప్రాణం కంటే పరువు ప్రతిష్టలను మిన్నగా భావించే ప్రతాప్ రెడ్డి గ్రామంలోని ప్రేమ, పెళ్లిళ్లను వ్యతిరేకిస్తుంటాడు. పొరుగు గ్రామానికి చెందిన శివ చదువు సంధ్యలు లేకుడా బాధ్యతారాహిత్యంగా స్పేహితులతో తిరుగుతుంటారు. అయితే కులాంతర వివాహాలను వ్యతిరేకించే ప్రతాప్ రెడ్డి కుమార్తె సంధ్య (ప్రియాంక రౌరీ))తో శివ ప్రేమలో పడుతాడు. తన కులానికి చెందని శివతో తన కూతురు ప్రేమ విషయం తెలిసిన ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు? శివ, సంధ్యను వేరు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? శివతో సంధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? శివ, సంధ్య ప్రేమకు ప్రతాప్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? శివ, సంధ్య ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా కథ.