రోజులు మారాయి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారు చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మురళి కృష్ణా ముదిదని నిర్వహించారు మరియు నిర్మాత జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చరు.
కథ
ఆధ్య(కృతిక), రంభ(తేజస్వి) అనే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ పీటర్(పార్వతీశం), అశ్వద్ (చేతన్)అనే ఇద్దరబ్బాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేస్తారు...వారిని తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకు వాడుకుంటారు. వీరిని ఇలా వాడుకుంటూనే మరోవైపు వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతూ వారినే మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఓ సారి ఓ బాబా ద్వారా... తమను పెళ్లాడే వారు పది రోజుల్లోనే చనిపోతారని తెలుసుకున్న ఈ ఇద్దరు గర్ల్స్. తమ జీవితం బావుండాలంటే మొదట ఎవరినైనా పెళ్లి చేసుకుని బలి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ మేరకు ఆద్య.. అశ్వద్ ను, రంభ..పీటర్ ను పెళ్లాడతారు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఇద్దరూ అశ్వద్, పీటర్ లను చంపేస్తారు. ఆద్య, రంభ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వీరి మరణం తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది....నిజంగానే అశ్వద్, పీటచ్ చనిపోయారా? అనేది మిగత కథ.